Begin typing your search above and press return to search.

ఆ 15 మంది కార్పోరేటర్లకి మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్

By:  Tupaki Desk   |   29 Sep 2020 4:30 PM GMT
ఆ 15 మంది కార్పోరేటర్లకి మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్
X
ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో ఏ క్షణమైనా గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సిద్దంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై పరిపాలనా శాఖా మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం బంజారాహిల్స్‌ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ లో కేటీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు,కార్పోరేటర్ల తో భేటీ అయ్యారు. బల్దియా ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్‌లతో సమావేశంలో కేటీఆర్ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణం అయిన గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం వుంది.. అందరూ సిద్ధంగా ఉండాలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని సర్వేలో తేలింది.. ఇప్పటికైనా పనితీరు మార్చుకోండి అని హితవు పలికారు. కార్పోరేటర్లకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పాలని ఆయన కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడ ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 60 వేల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు కేటీఆర్ వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని ఆయన కార్పొరేటర్లకు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండండి..గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయండి.. అవసరమయితే గ్రేటర్ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం.. ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలి.. అక్టోబర్ 1న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ దఫా గతంలో కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.