Begin typing your search above and press return to search.
కేసీఆర్ నిర్వాసితుడేనట!
By: Tupaki Desk | 22 Jun 2019 5:32 AM GMTఅభివృద్ధి సంగతి ఎలా ఉన్నా.. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరు ప్రాజెక్టు కింద మాయం కావటాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ..అక్కడే పుట్టి.. అక్కడే పెరిగి.. కళ్ల ముందు ఊరు మొత్తం మాయమవ్వటాన్ని మాత్రం మనసున్న వారెవరూ ఒప్పుకోలేరు. ఎవరికి వారికి.. వారి ఊరుచాలా గొప్ప. అలాంటిది ఊరు మొత్తం అభివృద్ధి పేరుతో.. ప్రాజెక్టు కారణంగా పెద్ద జలాశయంగా మారుతుందంటే జీర్ణించుకోవటం కష్టం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు నిర్వాసితులుగా మారటం.. ఊళ్లు ఖాళీ చేసేందుకు ఇష్టపడకపోవటం తెలిసిందే. భారీ నష్టపరిహారంతో నిర్వాసితుల్ని ఒప్పిస్తున్న ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేస్తుంటారు. అయితే.. నిర్వాసితుల కష్టాలు.. వారి ఇబ్బందులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదని చెబుతున్నారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తాజాగా ఆయన ఆసక్తికరంశాన్ని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు జలాశయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నిర్వాసితుడే అన్న విషయాన్ని చెప్పారు కేటీఆర్. ఆయన సొంత గ్రామం దోమకొండ మండలం పోసాన్ పల్లి ఎగువ మానేరు నిర్మాణ సమయంలో ముంపునకు గురైందని.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సిద్దిపేట మండలం చింతమడకలో స్థిరపడినట్లుగా వెల్లడించారు.
కేసీఆర్ కు మాత్రమే కాదు.. ఆయన సతీమణికి కూడా నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన విషయాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ అత్తగారి గ్రామమైన కొదురుపాక కూడా మధ్య మానేరు జలాశయం ముంపు ప్రాంతాల్లో ఉంది. ఇలా తమ ఇంట్లో నిర్వాసితుల కష్టాలు స్వయంగా చూసిన వారున్నారన్న విషయాన్ని కేటీఆర్ చెప్పారు.
నీటి విలువ.. రైతుల సాగు కోసం పడే తపన కేసీఆర్ కు తెలిసినంత బాగా దేశంలో మరే ముఖ్యమంత్రికి తెలీదన్నారు. మరింత తెలిసిన ఆయన.. ఆదివాసీల విషయంలో ఎందుకంత కరకుగా వ్యవహరిస్తున్నట్లు..?