Begin typing your search above and press return to search.
పవన్ తో ఎంత టచ్ లో ఉన్నానో చెప్తున్న కేటీఆర్
By: Tupaki Desk | 28 Dec 2018 5:37 AM GMTటీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సినీ సర్కిల్ తో ఎక్కువగా టచ్ లో ఉంటారనే సంగతి తెలిసిందే. ఆయనతో తెలుగు సినీ వర్గాలు సైతం అంతే దోస్తీని కొనసాగిస్తాయి. ఇలాంటి దోస్తీ వల్లే...తాజాగా ఆసక్తికర కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది. జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో కేటీఆర్ ఓ రేంజ్ లో దోస్తీ కొనసాగిస్తున్నారని, ఇంకా చెప్పాలంటే ఆయన పొలిటికల్ కెరీర్ గురించి కేటీఆర్ ఆలోచిస్తున్నారని స్పష్టమైంది. ఇందుకు వినయ విదేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేదిక అయింది.
రామ్ చరణ్ - కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ఆడియో సీడీని ఆవిష్కరించిన కేటీఆర్.. ఆ తర్వాత చిరుతో కలిసి థియెట్రికల్ ట్రైలర్ ను సంయుక్తంగా విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రతి ప్రసంగంలో ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? అంటూ రంగస్థలం సినిమాను వాడుకున్నానని - తెలంగాణ నాగన్నలు - రాజన్నలు తమకు ఏమికావాలో తేల్చుకొని టీఆర్ ఎస్ ను నిలబెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. సాధారణంగా తాను యాక్షన్ జోనర్ సినిమాలు చూడనని - కానీ దర్శకుడు బోయపాటి శ్రీను కోసం ఈ సినిమా చూడాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమాలో వినయ విధేయ రామ ఎవరని చిరంజీవిని అడుగగా.. ట్రైలర్ చూస్తే తెలుస్తుందని చెప్పారని - ట్రైలర్ లో రామ్ చరణ్ విధ్వంస రాముడిగా కనిపిస్తున్న చరణ్ తన తండ్రి చిరంజీవి నుంచి ఎంతో సంస్కారాన్ని వినయాన్ని - విధేయతను అలవర్చుకొని అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ తో ఈ మధ్యనే రెండు - మూడుసార్లు మాట్లాడానని - రాజకీయాలతోపాటు ఆయన సినిమా ప్రస్థానం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. కాగా పవన్ కెరీర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్ తన విలువైన సమయాన్ని కేటాయించి ఈ వేడుకకు రావడం సంతోషకరమని - ఆయన రాకతో ఈ వేడుకకు నిండుదనం వచ్చిందని అన్నారు. అసెంబ్లీలో తాను - కేటీఆర్ ఒకే బెంచీపై కూర్చునేవారమని - అప్పట్లో కేటీఆర్ చాలా తక్కువగా మాట్లాడేవారని - వినయ విధేయ రాముడిలా అనిపించేవారని - తనను కుశల ప్రశ్నలు వేసి మళ్లీ ఆయన పనిచూసుకునేవారని తెలిపారు. ఏదైనా బాధ్యతను స్వీకరిస్తే దాన్ని నెరవేర్చేవరకు నిద్రపోని కేటీఆర్.. జీహెచ్ ఎంసీతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విషయాన్ని మరోసారి నిరూపించారని, ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయభేరి మోగించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. నవతరానికి కేటీఆర్ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు.