Begin typing your search above and press return to search.
సిరిసిల్లలో అధునాతర రైతు బజార్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
By: Tupaki Desk | 23 Jun 2020 1:30 PM GMTరాజన్న సిరిసిల్ల జిల్లా లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేసారు. రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి జరుగుతుందన్నారు.
రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపడం సీఎం కేసీఆర్ పనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మూడేండ్లలో పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందన్నారు.
నీలి విప్లవంతో విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.కానీ , కొందరు తప్పుడు ప్రచారాలతో.. రైతు బంధు ఎగ్గొడతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదన్నారు. కల్నల్ సంతోష్ బాబును కేసీఆర్ ఆదుకుంటే… కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వి కేసీఆర్ ను అభినందించారని గుర్తు చేశారు. ఈ ఏడాది రూ. 25 వేల లోపు రుణమాఫీ ఒకసారి అమలు చేశామని వెల్లడించారు.