Begin typing your search above and press return to search.

కేటీఆర్ రిపోర్ట్.. ఈటలపై కేసీఆర్ డిసైడ్

By:  Tupaki Desk   |   1 Sep 2019 11:18 AM GMT
కేటీఆర్ రిపోర్ట్.. ఈటలపై కేసీఆర్ డిసైడ్
X
ఈటల రాజేందర్.. టీఆర్ ఎస్ లో అంతర్గతంగా పొగబెట్టడం వల్ల నొచ్చుకొని బరెస్ట్ అయిన మంత్రివర్యులు. టీఆర్ ఎస్ అధినేత సొంత పత్రికలో ఈటలను తొలగిస్తున్నారంటూ వార్తలు రావడంతో ‘గులాబీ బాస్ లం మేమే’ అంటూ కార్యకర్తల సమావేశంలో ఈటల ఆవేదనతో కూడి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

ఆ తర్వాత పరిణామాలు టీఆర్ ఎస్ లో వేగంగా మారాయట.. ఈటలను తొలగించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ మేరకు తన కుమారుడు - టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దీనిపై మంత్రుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించాడట. ఈ మేరకు టీఆర్ ఎస్ భవన్ కు మంత్రులందరూ వచ్చారట.. ఈటలను తొలగించవద్దని.. ఎర్రబెల్లి ఇతర మంత్రులు కేటీఆర్ కు స్పష్టం చేశారు. ఈటల లాంటి పార్టీ కోసం పనిచేసిన నేతపై అభాండాలు వేసి ఆగ్రహం తెప్పించారని.. ఆయనను తొలగిస్తే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ - బీజేపీ అవకాశంగా మలుచుకుంటాయని మంత్రులంతా కేటీఆర్ కు చెప్పినట్లు సమాచారం. అందుకే కేటీఆర్ తో భేటి తర్వాత మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ఈటల మాటలు ముగిసిన కథ అని.. ఈటల మంత్రివర్గంలో కొనసాగుతాడని చెప్పడం కొసమెరుపు.

ఈటలను తొలగిస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - కాంగ్రెస్ లు అవకాశంగా తీసుకొని లాభపడుతాయని.. ఈటల విషయంలో వెనక్కితగ్గాలని కేసీఆర్ కు చెప్పాలని మంత్రులంతా కేటీఆర్ ను కోరినట్టు సమాచారం. మీడియా వార్తకథనాలతోనే ఈటల నిస్ఫ్రహతో మాట్లాడారని.. వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని కోరినట్టు తెలిసింది.

కేటీఆర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించాలనే ఆలోచన నుంచి కేసీఆర్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. ఈటలను తొలిగిస్తే పార్టీకి నష్టమని.. హరీష్ - ఈటల గ్రూపు కట్టే ప్రమాదం ఉందని టీఆర్ ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. వారిద్దరూ బీజేపీలోకి చేరితే పార్టీ పెద్ద నష్టం అని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే శృతిమించినా ఈటలపై చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.