Begin typing your search above and press return to search.
టీడీపీ ఆఫీస్..ఎన్టీఆర్ మ్యూజియం అవుతుంది..
By: Tupaki Desk | 6 Nov 2018 11:18 AM GMTకేసీఆర్ ను ఓడించాలని హరీష్ రావు కుట్ర పన్నుతున్నాడని గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు - ఇతర కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావుపై విపక్షాలు చేస్తున్న విమర్శలు దిక్కుమాలినవని కేటీఆర్ మండిపడ్డారు. తనకు - హరీష్ రావుకు కుటుంబమే ఫస్ట్ అని.. ఆ తర్వాతే రాజకీయాలు అని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని.. అక్కడ హరీష్ రావు ప్రత్యర్థులను ఓడించేందుకు వ్యూహాలు పన్నుతుండడంతోనే అతడిని ఎదురించలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక కోదండరాంపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. కోదండరాం పోటీచేసేది కేవలం మూడు స్థానాల్లో అని.. దానికి మేనిఫెస్టో ప్రకటించడం విడ్డూరమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ - టీఆర్ ఎస్ కే అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దత్త పుత్రుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ గెలవరని స్పష్టం చేశారు.
మహాకూటమి ఇంకా సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారని.. ఇంకా ఎప్పుడు పుంజుకుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులు లేకపోవడం వల్లే కేసీఆర్ ఇంకా ప్రచారం చేయడం లేదని.. సరైన సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగుతారని కేటీఆర్ చెప్పుకొచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ మ్యూజియంగా మారిపోతుందని కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణలో కులపిచ్చి లేనే లేదని.. చంద్రబాబు ఏపీలో చేస్తున్న రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే అవి చెల్లవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం తమకు సాయం చేసిందని.. అందుకే ఎంఐఎంతో దోస్తి చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.