Begin typing your search above and press return to search.

ఎంఐఎం ఎంత‌గొప్ప‌దో కేటీఆర్ మాట‌ల్లో వినండి

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:24 PM GMT
ఎంఐఎం ఎంత‌గొప్ప‌దో కేటీఆర్ మాట‌ల్లో వినండి
X
తెలుగు రాజ‌కీయాలు క‌రెక్టుగా చెప్పాలంటే దేశ రాజ‌కీయాల్లో కూడా ఎంఐఎం గురించి పరిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ఆ పార్టీ సార‌థులైన ఓవైసీ బ్ర‌ద‌ర్స్ హిందూ దేవుళ్ల గురించి చేసిన విమ‌ర్శ‌లు - సంద‌ర్భాను సారం భార‌త‌దేశంపై చేసిన విద్వేష పూరిత వ్యాఖ్య‌ల గురించి దాదాపు మెజార్టీ వారికి గుర్తుండే ఉంటుంది. అలా త‌నదైన శైలిలో హిందూ వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డ్డ ఎంఐఎం గురించి టీఆర్ ఎస్ భావి నాయ‌కుడు - తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. అందులో తేల్చింది ఏంటంటే...మజ్లిస్‌ మతతత్వ పార్టీ కాదంట‌. ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టే మళ్లీ మళ్లీ గెలుస్తోంద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ త‌న తండ్రి కేసీఆర్‌ కు పూర్తి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ ఎందుకు నిర్వహించడం లేదని విలేకరులు ప్రశ్నించగా ప్రజా దర్బార్‌ పెట్టడానికి మాది రాజరికపు పాలన కాదని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇక ప్ర‌స్తుతం హాట్‌ హాట్‌ గా సాగుతున్న జిల్లాల విభ‌జ‌న గురించి మాట్లాడుతూ ..ప్రజల కోరిక మేరకే సిరిసిల్ల - గద్వాల - జనగామ - ఆసిఫాబాద్‌ లను జిల్లాలుగా చేయబోతున్నారని కేటీఆర్ తెలిపారు.సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో తన ప్రమేయం లేదని, డీకే అరుణ కోసం గద్వాలను జిల్లాగా చేయడం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్లను జిల్లా చేయాలని అక్కడి ప్రజలు కోరుకున్నందునే సీఎం కేసీఆర్‌ జిల్లాగా ప్రకటించారని తెలిపారు. జనగామ ప్రజలు కూడా జనగామను జిల్లా చేయాలని కోరుకున్నందునే జిల్లాగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చిన నాటి నుంచి ఆదివాసీల జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ వచ్చిందన్నారు. గిరిజనులు - ఆదివాసీల అభీష్టం మేరకు ఆసిఫాబాద్‌ ను జిల్లా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్‌ తెలిపారు.

గ్యాంగ్ స్ట‌ర్ న‌యీం ఎన్‌ కౌంట‌ర్ పై సైతం కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్‌ కౌంట‌ర్‌ పై సీబీఐ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అవి ప్ర‌తిపక్షాల దురుద్దేశ పూర్వ‌క విమ‌ర్శల‌ని తెలిపారు. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని తేలిన ఎంపీ మల్లారెడ్డి కాలేజీని కూల్చడానికి జీహెచ్‌ ఎంసి సిబ్బంది వెళ్లగా బీఆర్‌ ఎస్ పథకం కింద డబ్బులు చెల్లించడంతో ఆగిపోయినట్టు కేటీఆర్‌ వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/