Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు కేసీఆర్ ఆశ్చర్యాన్ని ఇచ్చారట
By: Tupaki Desk | 31 Jan 2016 9:50 AM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మామూలుగా అయితే ఇదే పరిణామం విడి రోజుల్లో జరిగి ఉంటే పార్టీలో అసంతృప్తి అండర్ కరెంట్ లా వ్యాపించేది. తెలంగాణ అధికారపక్షంలో కేటీఆర్.. హరీశ్ రావుల వర్గాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కాకుంటే.. ఇరువురు తమ తమ బ్యాచ్ ల్ని గుట్టుగా నడిపించటంతో పాటు.. కేసీఆర్ కారణంగా ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకోవటం తెలంగాణ రాజకీయాలతో పరిచయం ఉన్న వారందరికి ఈ విషయాలు సుపరిచితమే.
కొడుకు.. మేనల్లుడి విషయంలో సమతూకం పాటిస్తూ వచ్చిన కేసీఆర్.. వరంగల్ ఉప ఎన్నిక నాటి నుంచి కేటీఆర్ కు కాస్త ప్రాధాన్యం పెంచి.. హరీశ్ విషయంలో కాస్త తగ్గించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న మాట తరచూ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యత మొత్తం కేటీఆర్ చేతికి అప్పజెప్పటం.. హరీశ్ ను గ్రేటర్ ఎన్నికల్లో అస్సలు ఎంటర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంపై ఇప్పటికే విపక్షాలు ప్రస్తావిస్తూ విమర్శలు చేశాయి.
తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మంత్రి హరీశ్ రావును గ్రేటర్ హైదరాబాద్ నుంచి బహిష్కరించినట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ పడిన కష్టం చూసిన తాను.. తన దగ్గరున్న మున్సిపల్ శాఖను అప్పజెబుతున్నట్లు ప్రకటించారు.
వాస్తవానికి ముఖ్యమంత్రి వద్ద ఉంచుకున్న మున్సిపల్ శాఖను కొడుక్కిఇవ్వాలంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ.. అక్కడ హరీశ్ లాంటి మేనల్లుడు ఉండటంతో సమయం చూసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా హరీశ్ ను అభిమానించే వర్గం లోగుట్టుగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక.. ఈ పరిణామంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. తనకు మున్సిపల్ శాఖ అప్పగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. తండ్రి మాట కొడుక్కి ఆశ్చర్యం కలిగించుడేమిటో.. కేటీఆర్.. కేసీఆర్ లకే అర్థం కావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.