Begin typing your search above and press return to search.

కేటీఆర్ చెప్పే గొప్ప వార్త‌..యాపిల్ గురించేనా?

By:  Tupaki Desk   |   18 May 2016 4:37 AM GMT
కేటీఆర్ చెప్పే గొప్ప వార్త‌..యాపిల్ గురించేనా?
X
అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. మీకు పెద్ద వార్త చెబుతా. కాకుంటే.. ఎల్లుండి దాకా ఆగండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఊరింపు ఒక రోజు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తుపాకీ ఊహించిన‌ట్లే.. కేటీఆర్ చెప్పే పెద్ద వార్త‌.. ఏదైనా పెద్ద సంస్థ హైద‌రాబాద్ కు రావ‌ట‌మేన‌న్న అంచ‌నా స‌రిపోయింది. హైద‌రాబాద్ కు ప్ర‌ఖ్యాత యాపిల్ సంస్థ రానున్న విష‌యాన్ని ఈ రోజు మీడియా ప‌తాక శీర్షిక‌లో ప్ర‌చురించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైద‌రాబాద్ వ‌స్తార‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో భేటీ అయి.. డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ షురూ చేస్తార‌న్న అంచ‌నాల‌తో పెద్ద వార్త‌ను అచ్చేశాయి.

ఇంత ప్ర‌ముఖంగా ఞ‌క కంపెనీ వ‌స్తుంద‌న్న వార్త‌లు రావ‌టం అంటేనే.. అందుకు సంబంధించిన ప‌క్కా స‌మాచారం ప్ర‌భుత్వం నుంచి కానీ ప్ర‌భుత్వాధినేత‌ల నుంచి కానీ ఉప్పంది ఉంటుంద‌న్న విష‌యంలో వేరే మాట లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ ప్ర‌భుత్వంతో యాపిల్ సంస్థ ఒక ఎంవోయూ కూడా కుదుర్చుకుంటుంద‌ని.. నాన‌క్ రాం గూడ‌లోని తిష్ మ‌న్ స్పేయ‌ర్ లోని వేవ్ రాక్ ట‌వ‌ర్ లో డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ కు అవ‌స‌ర‌మైన స్థ‌లాన్ని లీజుకు తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ సెంట‌ర్ మీద ఇప్ప‌టికే 10 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా వార్త‌లువ‌చ్చాయి. ఇలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు రావాలంటే అయితే యాపిల్ అన్న‌చెప్పాలి.. లేదంటే ప్ర‌భుత్వ‌మైన త‌న‌దైన శైలిలో చెప్పి ఉండాలి. యాపిల్ అధికార‌ప్ర‌క‌ట‌న చేసి ఉంటే.. అదేవిష‌యాన్నితాటికాయంత అక్ష‌రాల్లో ప్ర‌చురించేవారు. అలాంటిదేమీ లేదంటే.. తెలంగాణ‌ప్ర‌భుత్వం నుంచే దీనికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుంద‌ని చెప్ప‌టంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.

అమెరికాలోకాకుండా బ‌య‌ట మ‌రే దేశంలోనూ యాపిల్ కు టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ మెంట్ సంస్థ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. చైనా ప‌ర్య‌ట‌న ముగించుకొని మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కుక్‌.. బుధ‌వారం ప్ర‌ధాని మోడీతో భేటీ అవుతార‌ని.. అనంత‌రం హైద‌రాబాద్‌కు వ‌చ్చి తెలంగాణ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంటార‌ని చెబుతున్నారు. ఏమైనా కేటీఆర్ చెబుతాన‌న్న బిగ్ న్యూస్ ఆయ‌న నోటి కంటే ముందే మీడియాలోనే ప్ర‌ముఖంగా వ‌చ్చేయ‌టం గ‌మ‌నార్హం.