Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఆలోచన హైదరాబాద్ దశను మార్చేస్తుందా?
By: Tupaki Desk | 26 Sep 2019 7:53 AM GMTప్రస్తుతం హైదరాబాద్ గురించి పరిచయం చేయాలంటే...హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు...నగరమంతా...చెరువును తలపిస్తోందని చెప్పుకోవచ్చు! నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా...నీరే. తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు. జీహెచ్ ఎంసీలోని రోడ్లతో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న ప్రజలకు ఊరట కలిగించేలా ఓ ప్రతిపాదన వచ్చింది. జీహెచ్ ఎంసీ రోడ్లను ప్రైవేటీకరణ చేయాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారనేది దాని సారాంశం. అయితే, దీనిపై సహజంగానే వివాదం ముసురుతోంది.
ఇటీవలే రెండో దఫా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ గ్రేటర్ రోడ్లు సహా మూసి డెవలప్ మెంట్ - హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో హెచ్ ఎండీఏ - జీహెచ్ ఎంసీ - హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు పాల్గోన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు రొడ్ల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొనాలని అదేశించారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు అధికారులంతా సాధ్యమైనంత ఎక్కువ సమయం ఈ మరమ్మతులకు కేటాయించాలని కోరారు. నూతనంగా నిర్మించబోయే ఫ్లై ఓవర్లు - స్కై వేల నిర్మాణాల్లో బీటి రోడ్ల బదులు పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయాలని - దీంతో కనీసం దశాబ్ద కాలం పాటు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రోడ్ల తాలుకు డీపీఆర్ తయారీకి ఒక్క కన్సల్టెంట్ తో మాత్రమే కాకుండా సాద్యమైనంత ఎక్కవ మందికి అధిక కన్ సల్టెంట్లతో పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగానే రోడ్లను ప్రైవేటీకరణ చేయాలనే సూచన వచ్చినట్లు సమాచారం.
రోడ్లను ప్రైవేటీకరణ చేయాలనే మంత్రి ప్రతిపాదన లీకుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. వర్షాలకు రీపేర్ల పేరుతో గ్రేటర్ లో పైపైన పనులు చేయడం ద్వారా రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. రోడ్ల బాగు పేరుతో నిధులను పక్కదారి పట్టించడం - అక్రమాలను అరికట్టడం వంటి వాటిపై దృష్టి పెట్టకుండా... ప్రైవేట్ నిర్వహణకు ఇస్తామని చెప్పడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమని ఆక్షేపించింది. రోడ్లను ప్రైవేటు పరం చేయడమనే ఆలోచన కంటే..ప్రభుత్వ అధికారులు - ప్రజల భాగస్వామ్యంతో ఉత్తమంగా తీర్చిదిద్దడంపై సర్కారు దృష్టి పెట్టాలని హితవుపలికింది.