Begin typing your search above and press return to search.
ప్రోగ్రాం చూడలేదు కానీ ఏ ఫ్యాంట్ వేశారో చూశారే కేటీఆర్?
By: Tupaki Desk | 29 April 2019 4:46 AM GMTపంచ్ లు వేయటంలో తండ్రి నైపుణ్యాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో మరో లక్షణం కూడా ఉంది. తనకు నచ్చిన ప్రశ్నకు ఎలా అయితే సమాధానం ఇస్తారో.. ఇష్టం లేని ప్రశ్నకు అంతే తెలివిగా తప్పించుకునే లక్షణం కనిపిస్తుంటుంది. అయితే.. ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేసి.. మిగిలిన దాంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే కేటీఆర్ తీరును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.
మీడియాతో చిట్ చాట్ చేసే తరహాలో.. కాస్త తీరిగ్గా ఉంటే.. సోషల్ మీడియాతో ప్రజలతో నేరుగా మాట్లాడే అలవాటున్న కేటీఆర్.. తాజాగా అస్క్ కేటీఆర్ పేరుతో ఒక సోషల్ మీడియా ముఖాముఖిని నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఆయన.. ఇంటర్ వివాదం విషయంలో ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను తన మాటలతో చెప్పటమే కాదు.. ఇష్యూను పెద్దది చేయొద్దన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.
విద్యార్థుల ఆత్మహత్యలు తనకు బాధను కలిగించాయని.. ఒక తండ్రిగా వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనన్న ఆయన.. గ్లోబల్ ఎరీనాకు తనకు సంబంధం ఉందంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పేప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కువగా ఇంటర్ విద్యార్థుల ఎపిసోడ్ ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వివరించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
అలా అని.. దాని కోసమే కార్యక్రమం అన్నట్లు తెలిస్తే అంత బాగోదు కాబట్టి.. మిగిలిన అంశాలు కొన్నింటిని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేయటం.. మీడియాలో ఆ అంశాలు ప్రముఖంగా వచ్చాయి. ఇదే విషయాన్ని కేటీఆర్ ను ప్రశ్న రూపంలో సంధించారో నెటిజన్. మోడీ.. అక్షయ్ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వేరే వారు ఎలాంటి సమాధానం చెబుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. కేటీఆర్ మాత్రం తెలివిగా.. ఒక్క విమర్శ చేయకుండా.. ఒక కొత్త విషయం మీద విషయాన్ని ఫోకస్ పెట్టేలా చేసిన వైనాన్ని అభినందించాల్సిందే. ఇంటర్వ్యూ సందర్భంగా అక్షయ్ పింక్ కలర్ ఫ్యాంట్ వేసుకున్నారని చెప్పిన కేటీఆర్.. ఆ ముఖాముఖిని చూడలేదన్నారు. ఇంటర్వ్యూను చూడని కేటీఆర్.. అక్షయ్ ఫ్యాంట్ కలర్ మాత్రం చూడటం ఏమిటో?