Begin typing your search above and press return to search.
దేశంలో టీకా కొరతకు సొల్యూషన్ చెప్పిన కేటీఆర్
By: Tupaki Desk | 5 Jun 2021 9:50 AM GMTదేశ వ్యాప్తంగా కొవిడ్ టీకా కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన వేళ ప్రచారం పెద్దగా లేకపోవటం.. టీకా మీద ఉన్న సందేహాలు వెరసి వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రాని పరిస్థితి. సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలంతా టీకాలు వేయించుకోవటానికి ముందుకు వస్తున్నారు. అదే సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోవటం.. ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లు విదేశాలకు పోగా.. దేశానికి మిగులుతున్నవి తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు.. మరిన్ని టీకా కంపెనీలు దేశంలోకి వచ్చేందుకు అవసరమైన కసరత్తు విషయంలో కేంద్రం ఆలస్యం చేసిందన్న విమర్శలు ఎక్కువ అయ్యాయి.
అన్నింటికి మించిన టీకాలు పరిశోధన స్థాయిలో ఉన్నప్పుడే పలు దేశాలు పెద్ద ఎత్తున నిధులు సమకూరిస్తే.. మోడీ సర్కారు అందుకుభిన్నంగా వ్యవహరించిందన్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున నిధుల్ని అడ్వాన్సుల రూపంలో ఇచ్చి ఉంటే.. ఈ రోజున వ్యాక్సిన్ల కోసం ఇంతలా ఎదురుచూడాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పక తప్పదు. ఇప్పుడున్న టీకా డిమాండ్ కు తగ్గట్లు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహా జోరుగా సాగేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
అమెరికాతో సహా పలు దేశాల్లో టీకాల నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయని.. కోట్లాది వెయిల్స్ నిరుపయోగంగా పడి ఉన్నాయని.. కేంద్రం ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే టీకా కొరత తీరే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ అవసరాలకు మించి కొన్ని దేశాలు వ్యాక్సిన్లు కొనుగోలు చేయటంతో పెద్ద ఎత్తున ఉండిపోయాయి ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వారి అవసరం ఎంత? వారికి అవసరమైన టీకాలు ఎన్ని అన్న విషయంపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో.. కేంద్రం కలుగజేసుకొని ఆ టీకాల్ని యుద్ధ ప్రాతిపదికన తెప్పిస్తే దేశంలో వ్యాక్సిన్ కొరత తగ్గే వీలుందన్న మాట చెప్పారు. విన్నంతనే వర్కువుట్ అయ్యేలా ఉన్న ఈ ఆలోచనను మోడీ అండ్ కో తీసుకుంటుందా? అన్నది ప్రశ్న. ఏమైనా.. టీకా కొరత తీరేలా కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చిన మంత్రి కేటీఆర్ ను అభినందించాల్సిందే.