Begin typing your search above and press return to search.

బెంగుళూరును చూసి తొడగొడుతున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   18 July 2015 10:04 AM GMT
బెంగుళూరును చూసి తొడగొడుతున్న కేటీఆర్
X
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భారీ లక్ష్యమే పెట్టుకున్నారు.. దేశంలో ఐటీ ఇండస్ర్టీకి ప్రధాన కేంద్రమైన బెంగుళూరును తలదన్నేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరును వెనక్కు నెట్టి హైదరాబాద్ ను కొద్ది సంవత్సరాల్లో దేశంలోనే ఐటీలో నంబర్ 1 నగరంగా మార్చాలని ఆయన కంకణం కట్టుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా బెంగుళూరు ఐటీ ఎగుమతుల్లో నంబర్ 1 స్థానంలో ఉంది.

బెంగళూరు ఐటీ రంగంలో నంబర్ 1గా ఉండడమే కాదు.. మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందుంది. బెంగళూరు ఐటీ ఎగుమతుల శాతం 31 కాగా హైదరాబాద్ ఐటీ ఎగుమతులు కేవలం 13 శాతమే. దీంతో బెంగళూరును ఢీకొట్టాలంటే హైదరాబాద్ చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అందులోభాగంగానే వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఐటీరంగాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశగా ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి.... ఇప్పటికే కొత్తగా కొన్ని ఐటీ పరిశ్రమలూ ఏర్పడ్డాయి. వాటిలో సుమారు 15000 మందికి ఉపాధి లభించిందని... దేశంలో ఇంకే నగరంలోనూ ఒక్క ఏడాదిలో ఇంతమందికి ఉపాధి దొరకలేదని కేటీఆర్ చెబుతున్నారు. సాంకేతిక రంగంలోనూ హైదరాబాద్ ను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. బెంగళూరులో ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన మార్సు మిషన్ కు సంబంధించి 30 శాతం పరికరాలు హైదరాబాద్ నుంచే వెళ్లాయని ఆయన తెలిపారు