Begin typing your search above and press return to search.
గ్రేటర్ లో 'తారక' మంత్రం
By: Tupaki Desk | 14 Dec 2015 8:59 AM GMTటీఆరెస్ పార్టీ తాను ఇంతకాలం బాగా వీక్ గా ఉన్న హైదరాబాద్ లోనూ విజయం సాధించే దిశగా స్పీడు పెంచింది. ఇటీవల విజయాలు... ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవ రాజకీయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మంచి హుషారుగా కనిపిస్తోంది. ఉద్యమ పార్టీగా ఉన్న కాలంలో ఎలాగూ హైదరాబాద్ లో ప్రభావం చూపించలేకపోయిన టీఆరెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. అలాంటి టీఆర్ ఎస్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. కొద్దికాలంలో ఈ మార్పు ఎలా సాధ్యమైంది.. ప్రతిపక్షాలను తన వ్యూహాలతో చిత్తు చేస్తూ విపక్ష నేతలను తన వలలో పడేలా ఎలా చేయగలుగుతోంది... క్యాడర్ లో జోష్ ఎలా తేగలిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. ''తారక మంత్రం''. అవును... కల్వకుంట్ల తారక మంత్రం. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో అదే చర్చ.
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో దేశం విస్తుపోయేలా అత్యధిక మెజారిటీని టీఆర్ ఎస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి తనయుడు తారక రామారావు.. ఇప్పుడు అదే మంత్రా న్ని గ్రేటర్ లోనూ ప్రయోగిస్తూ గులాబీ పార్టీలో జోష్ నింపుతున్నారు. ఐటీ హబ్ లతో పాటు త్రీ 'ఐ' మంత్రాన్ని జపిస్తూ ఆధునిక యువ తను ఆకట్టుకున్న కేటీఆర్.. అలుపెరగకుండా 13 నియోజకవర్గాల్లో ఒకేరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి నగర ప్రజల చూపునంతా తన వైపునకు తిప్పుకున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ లో ఆది నుంచి టీఆర్ ఎస్ కు ఆదరణ లేకపోగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానం సాధించింది. ఆ తరువాత టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పార్టీలోకి తీసుకోని మంత్రి పదవి ఇచ్చింది. కింది స్థాయి కేడర్ అనేక మంది గులాబీ గూటికి చేరినా, పూర్తి స్థాయి పట్టు లభించలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నగర విద్యావంతులు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో ముఖ్యమంత్రి వ్యూహం మార్చి హైదరాబాద్ బాధ్యతను యువకుడు - విద్యావంతుడైన తన తనయుడిపై పెట్టారు.
యువతకు రోల్ మోడల్ గా కనిపిస్తున్న కేటీఆర్ విభిన్న వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో బస్తీ పేదలను, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆకట్టుకున్న ఆయన.. ఐటీ హబ్ లు - స్టార్టప్ లతో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వలసలు - రాజకీయ ఎత్తులతో ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నారు. ఆంధ్రా పెట్టుబడిదారులు వలస పోకుండా నిలువరించడంలో కేటీఆర్ విజయం సాధించారు. నిరంతర ఆంధ్రా ప్రాంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, సెటిలర్లకు భవిష్యత్త్ పై భరోసా కల్పిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో టీఆరెస్ విషయంలో ప్రజల ఆలోచనా ధోరణి మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కేటీఆర్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుండగా పార్టీ కేడర్ లోనూ ఉత్సాహం తొణికిసలాడుతోంది. కేటీఆర్ అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు బస్తీలను చుట్టేస్తున్నారు. దీంతో గులాబీ కేడర్ గ్రేటర్ ఎన్నికల కోసం మరింత స్పీడు పెంచింది.