Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్‌ @ టార్గెట్‌ కేటీఆర్‌

By:  Tupaki Desk   |   18 Nov 2018 6:26 PM GMT
గ్రేట‌ర్‌ @ టార్గెట్‌ కేటీఆర్‌
X
కల్వకుంట్ల తారక రామారావు టీఆర్ ఎస్ పార్టీ యువ‌నేత‌. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన గులాబీ దండుకు ముందుండి నడిపిన కింగ్‌ మేకర్‌ ..! అభ్యర్థుల ఎంపిక నుంచి ఫలితాల్లో జైత్రయాత్ర సాగించడం దాకా అన్నీ తానై నడిపించి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికలతో చాలా డివిజన్లలో సంస్థాగతంగా బలపర్చుతూ దాదాపు 120 డివిజన్లలో 135 చోట్ల ప్రసంగాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ను 360 డిగ్రీల కోణంలో కేటీఆర్‌ చుట్టుముట్టి వచ్చారు. విశ్వనగర సాధనకు తామేమి చేస్తామో కేటీఆర్‌ ప్రతి చోట సోదాహరణంగా వివరిస్తూ సాగారు. 99చోట్ల జయకేతనం ఎగురవేసి స్వంతంగా మేయర్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. వాస్తవంగా జంట జిల్లాలు రంగారెడ్డి - హైదరాబాద్‌ లో 2014లో టీఆర్‌ ఎస్‌ కు 24 శాతం ఓట్లు లభిస్తే - జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో 47శాతానికి పెరిగి ఏకంగా అదనంగా 23శాతం ఓట్ల శాతాన్ని పెంచుకుని బలమైన శక్తిగా అవతరింపజేశారు. ఇందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో పాతనగరం మినహా అన్నీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో కేటీఆర్‌ వీలైనంత మేర గ్రేటర్‌ పై సమయాన్ని కేటాయిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లోనూ గ్రేటర్‌ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్‌ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం షెడ్యూల్ ఖరారు చేశారు. ఇప్పటికే మన నగరం-మన హైదరాబాద్‌ - ఆత్మీయ సమావేశాలు - కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మినీ ఇండియా లాంటి నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి స్థిరపడిన ప్రజల బాధ్యత నాదేనని - సోదరుడిగా - అన్నగా మీలో ఒక్కరిగా కేసీఆర్‌ కుమారుడిగా అండగా ఉంటానంటూ భరోసాతో అన్ని వర్గాల మద్దతును కూడగట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్‌ ఇక పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం గ్రేటర్‌ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని - డివిజన్‌ - బూత్‌ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలను అభ్యర్థులకు వివరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు గ్రేటర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ స్థానిక అభ్యర్థులతో కలిసి రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో హైదరాబాద్‌ లో జరిగిన అభివృద్ధి-హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా రూపొందించే ప్రణాళికలు - రాబోయే మూడేళ్లలోనే 50వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలను ప్రజలను వివరించనున్నారు. ఇక ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో - వచ్చే నెల 3న జరిగే పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. యువనేత ప్రచారంతో గులాబీ పార్టీ అభ్యర్థులకు మరింత కలిసి రానుందని, వారి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేటీఆర్ ప్ర‌చార షెడ్యూల్ ఇదే.

తేదీ నియోజకవర్గాలు

21 ఉప్పల్‌ - మల్కాజ్‌ గిరి
22 మహేశ్వరం - ఎల్భీనగర్‌
23 కంటోన్ మెంట్‌ - సికింద్రాబాద్‌
24 సనత్‌ నగర్‌ - జూబ్లీహిల్స్‌
26 కుత్భుల్లాపూర్‌ - కూకట్‌ పల్లి
27 గోషామహల్‌ - ఖైరతాబాద్‌
28 శేరిలింగంపల్లి/పటాన్‌ చెరు - రాజేంద్రనగర్‌
29 అంబర్‌ పేట - ముషీరాబాద్‌