Begin typing your search above and press return to search.

తప్పేం మాట్లాడినా అంటూనే మోడీని ఏసుకున్నాడు

By:  Tupaki Desk   |   13 Jan 2016 5:14 AM GMT
తప్పేం మాట్లాడినా అంటూనే మోడీని ఏసుకున్నాడు
X
రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే.. సాదాసీదా ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించటంతో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఇక.. అధికార పార్టీ ముఖ్యనేత.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాయింట్ టచ్ చేస్తే భావోద్వేగం ఎగిసిపడుతుందో ఆ ఫ్యామిలీలో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్దిరోజులుగా ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో పొగిడేస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలోనే కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ప్రధాని మోడీకి అస్సలు పట్టటం లేదన్న వాదనను మరోసారి పునరుద్ఘాటించటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా మోడీపై కేటీఆర్ విమర్శల వర్షం కురిపిస్తుండటం తెలిసిందే. ప్రధాని మోడీ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా ఇప్పటివరకూ ఆయన హైదరాబాద్ కు ఎందుకు రాలేదో చెప్పాలంటూ సూటిగా నిలదీస్తున్నారు. ప్రధాని రావటం తర్వాత.. ఆయన్ను తెలంగాణ సర్కారు ఇప్పటివరకూ సగౌరవంగా తమ రాజధానికి ఆహ్వానించిందా? అని కేటీఆర్ అండ్ కో ను ప్రశ్నించే వారెవరు? అన్నది ఒక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీపై మరోసారి కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుల్లేవని తేల్చిన కేటీఆర్.. ‘‘మోడీ రాష్ట్రానికి రావటం లేదు. ముఖం చూపించటం లేదు. హైకోర్టు విభజన మొదలు ఎన్నో విభజన అంశాల్లో ప్రధాని చొరవ చూపింది లేదు. బీహార్..కాశ్శీర్ లకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన మోడీ.. తెలంగాణ విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? తెలంగాణకు ఎందుకు ప్యాకేజీ ప్రకటించరు. తప్పుగా మాట్లాడిన అంటున్నారు. అసలు నేనేం తప్పుగా మాట్లాడిన అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న కేటీఆర్ ను చూస్తే తండ్రికి తగ్గ తనయుడన్న మాట అర్థంకాక మానదు.