Begin typing your search above and press return to search.
మంత్రి కేటీఆర్ కు సోకిన మహమ్మారి..
By: Tupaki Desk | 30 Aug 2022 4:11 PM GMTటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు స్వయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. స్వల్ప లక్షణాలతోనే కరోనా బారినపడ్డట్టు తెలిపారు.
గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ కోరారు.
ఇటీవల కాలి గాయం నుంచి కోలుకున్న కేటీఆర్.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇక 2021 ఏప్రిల్ లో కూడా కరోనా తీవ్రత బాగా ఉన్న టైంలో కూడా కేటీఆర్ కరోనా బారినపడడం విశేషం.
కేటీఆర్ ఇటీవల తరుచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు? ఇదివరకే కాలు నొప్పితో బాధపడ్డ కేటీఆర్ దాదాపు 15 రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న వేళ మరోసారి కరోనా బారినపడ్డారు.
పార్టీకి చెందిన ముఖ్య నేతలతోపాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. త్వరగా రికవరీ కావాలని కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.