Begin typing your search above and press return to search.

మరోసారి తనమంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్!

By:  Tupaki Desk   |   22 Feb 2020 11:45 AM GMT
మరోసారి తనమంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్!
X
ఆపద సమయంలో అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆ దేవుడే ...ఆ తరువాతే ఎవరైనా గుర్తుకు వస్తారు. దేవుడా నన్ను ఈ ప్రమాదం నుండి బయటపడేయ్ అని మొక్కని మానవుడంటూ ఉండడు. ఆ భగవంతుడి తర్వాత గుర్తుకు వచ్చేది మంత్రి కేటీఆర్‌. తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సామాన్యుల సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ చొరవ చూపి ఎన్నో కుటుంబంలో సంతోషం నింపారు.

తాజాగా ఇలాంటి సమస్యనే ఒకటి కేటీఆర్ పరిష్కరించారు. అన్న ఆపద వచ్చింది అని కేటీఆర్ కి తెలిపితే ..సహాయం చేయకుండా ఉండరు. డైరెక్ట్ గా ఆయన్ని అందరూ కలిసి తమ భాదలు చెప్పుకోలేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకి మనం చెప్పాలి అనుకున్న విషయాని తెలియజేస్తే చాలు ...కేటీఆర్ నిత్యం సోషల్ మీడియా లో బిజీగా ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే... సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నివాసి అయిన ప్రశాంత్ కొమ్మిరెడ్డి అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్నాడు. అతనికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ప్రశాంత్‌ కు భార్య మూడేళ్ల కుమార్తె ఉంది. ప్రశాంత్ భార్య నిండు గర్భిణీ. ఫిబ్రవరి 22వ తేదీన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో ప్రశాంత్ మృతి చెందడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుటుంబ సభ్యులు అమెరికాకు రావాలంటే వీసా ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హాస్పిటల్‌లో ప్రశాంత్ భార్య అడ్మిట్ అయ్యింది. మూడేళ్ల కుమార్తె ఒంటరిగా ఉంటోంది.

దీనితో ప్రశాంత్ స్నేహితుడు సంతోష్‌ కు మంత్రి కేటీఆర్ గుర్తుకు వచ్చారు. ఆయనకు జరిగిన విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు వీసా ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు చొరవ చూపాలంటూ సంతోష్ ట్వీట్ చేశాడు. అంతేకాదు మరో మూడు రోజులు అమెరికాలో సెలవు దినాలు అని చెప్పాడు. ట్వీట్‌కు వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. అమెరికా ఎంబసీకి జరిగిన విషయం గురించి ట్వీట్ చేశారు. వెంటనే ప్రశాంత్ సోదరుడికి వీసా ఇంటర్వ్యూను పూర్తి చేసి సహకరించాల్సిందిగా మంత్రి కేటీఆర్ అమెరికా ఎంబసీని కోరారు. అంతే ఆ తరువాత పనులన్నీ కూడా చకచకా పూర్తి అయ్యాయి. దీనితో ప్రశాంత్ సోదరుడు అమెరికాకి చేరుకున్నాడు. తమ భాదని అర్థం చేసుకొని , సకాలంలో స్పందించిన మంత్రి కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు ప్రశాంత్ కుటుంబ సభ్యులు.