Begin typing your search above and press return to search.
టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన భీమవరం బుల్లోడు
By: Tupaki Desk | 8 Jan 2016 8:45 AM GMT‘‘తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తాం. నేనైతే.. నా నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నా. నేను భీమవరం నుంచి పోటీ చేస్తా’’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో 1.47 నిమిషాలున్న ఈ చిట్టి వీడియో తళుక్కున మెరిసింది. కావాల్సినంత మసాలా ఉండటంతో.. చాలా తక్కువ సమయంలోనే ఇది వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని.. ఈ నేపథ్యంలో తాము కూడా పేరు మార్చుకోవాలని అనుకుంటున్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలుగు రాష్ట్ర సమితిగా పేరు మార్చి.. మీ దగ్గరకు కూడా వస్తున్నాం త్వరలో వస్తున్నామని తన దగ్గరకు వచ్చిన ఏపీ మంత్రికి చెప్పినట్లుగా కేటీఆర్ వెల్లడించారు.
ఒకవేళ తాను చెప్పినట్లుగా అలాంటి పరిస్థితే వస్తే.. తన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నట్లుగా కేటీఆర్ వెల్లడించారు. ‘‘నేను ఇప్పటికే నా నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నా. నేను కచ్ఛితంగా భీమవరం నుంచే పోటీ చేస్తా. ఎందుకంటే మా మిత్రులకు నేను చెబుతుంటా.. భీమవరంలో గెలవటం చాలా సింఫుల్. చిన్న ట్రిక్ ఏమిటంటే.. కోడి పందాల్ని లీగలైజ్ చేస్తామని చెబితే చాలు గెలిచేస్తాం’’ అని చెబుతానంటూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్ నోట నుంచి వచ్చిన ‘‘భీమవరం’’ మాట అందరిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఫేస్ బుక్ లోనూ.. వాట్సప్ లోనూ భారీగా ఫార్వర్డ్ చేయటం కనిపిస్తోంది. ఇక టీవీ ఛానళ్లలో ప్రత్యేక ప్యాకేజీగా వార్త ఇస్తున్నారు. ఏది ఏమైనా.. పార్టీ పేరు మారుస్తూ.. తాను ఆంధ్రా నుంచి పోటీ చేసే విషయం కేటీఆర్ నోటి నుంచి రావటం ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందని చెప్పక తప్పదు.