Begin typing your search above and press return to search.

టికెట్ల లెక్క‌ల‌న్నీ విన‌య విధేయ రామ చేతికే!

By:  Tupaki Desk   |   22 April 2019 4:25 AM GMT
టికెట్ల లెక్క‌ల‌న్నీ విన‌య విధేయ రామ చేతికే!
X
చేతిలో అధికారం ఉన్నా.. దాన్ని బ‌దిలీ చేయ‌టం అంత తేలికైన క‌త కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా.. జ‌రిగే న‌ష్టం పూడ్చ‌లేనంత‌. అందునా.. బ‌ల‌మైన నేత పొంచి ఉన్నాడ‌న్న సందేహం ఉన్న‌ప్పుడు.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఇలాంటి విష‌యాల్లో స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండానే అత్యంత అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించటంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా.

తెలంగాణ అధికార‌ప‌క్షానికి కేంద్ర బిందువుగా ఉన్న ఆయ‌న‌.. త‌నకున్న అధికారాన్ని త‌న రాజ‌కీయ వార‌సుడు క‌మ్ కొడుకు కేటీఆర్ చేతికి ద‌ఖ‌లు ప‌ర్చేందుకు వీలుగా గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఆయ‌నెన్నో ప్రోగ్రామ్స్ ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్యూహాత్మ‌కంగా హ‌రీశ్ ను క‌ట్ చేస్తూ.. దాని స్థానే కేటీఆర్ కు పెద్ద పీట వేస్తున్న కేటీఆర్.. టీఆర్ ఎస్ లో విన‌య విధేయ రామ ప్రోగ్రాంను ముమ్మ‌రం చేశారు.

తాజాగా కాంగ్రెస్‌.. టీడీపీ విలీనం కూడా విన‌య విధేయ రామ ఎపిసోడ్ లో భాగ‌మ‌నే చెప్పే వారు లేక‌పోలేదు. రేపొద్దున అధికార బ‌దిలీ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన వెంట‌నే.. పార్టీలో అంత‌ర్గ‌తంగా చోటు చేసుకునే కుదుపుల‌కు రాముడికి ప‌ట్టు మిస్ కాకూడ‌ద‌న్న ల‌క్ష్యంతోనే కేసీఆర్ పావులు క‌దుపుతున్న‌ట్లు చెబుతున్నారు. పైకి చెప్ప‌కున్నా.. కేటీఆర్ కు కౌంట‌ర్ పార్ట్ గా ఉన్న హ‌రీశ్ నుంచి వ‌చ్చే ముప్పుకు అనుగుణంగానే కేసీఆర్ ప్లానింగ్ ఉంద‌న్న మాట‌ను వినిపిస్తూ ఉంటుంది. బ‌య‌ట‌కు బావ‌.. బావ‌మ‌రుదుల మ‌ధ్య అన్యోన్యం మామూలుగా లేద‌న్న‌ట్లుగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం లుక‌లుక‌లు చాలానే ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తూ ఉంటాయి.

తాజాగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇచ్చే బాధ్య‌త‌ను కేటీఆర్ కు అప్ప‌జెబుతూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. అన్ని జిల్లా ప‌రిష‌త్ లు.. మండ‌ల ప‌రిష‌త్ ల‌లో గులాబీ జెండా ఎగురువేయ‌ట‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ ఒక వ్యూహాన్ని సిద్ధం చేశార‌ని చెబుతున్నారు. అయితే.. దాన్ని అమ‌లు చేసే అవ‌కాశాన్ని మాత్రం కేటీఆర్ కే ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

పార్టీవిధేయుల‌కే టికెట్లు ఇవ్వాలంటూ మంత్రులు.. ఎమ్మెల్యేలను కోరారు. ఇదంతా ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎమ్మెల్యేల విష‌యంలో విన‌య విధేయ రామా అనే వారు ఉన్నారు. అక్క‌డితో స‌రిపోదు క‌దా? దాని స్థాయిని స్థానికం వ‌ర‌కూ తీసుకెళ్లి విన‌య విధేయ రామా ప్రోగ్రాంను మ‌రింత క‌ట్టుదిట్టంగా నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌తోనే టికెట్లు ఇచ్చే బాధ్య‌త‌ను కేటీఆర్ మీద పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి విన‌య విధేయ రామా ప్రోగ్రాంను కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా న‌డిపిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.