Begin typing your search above and press return to search.
బాబు లాంటి తప్పిదం చేయవద్దనే కేటీఆర్ ఇలా...
By: Tupaki Desk | 8 Jan 2018 9:52 AM GMTపరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఐటీ రంగానికి హైదరాబాద్ లో బీజం వేసింది కాకపోయినా...దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు కృషి ప్రశంసనీయమే. సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు కృషి ప్రశంసనీయమని అంగీకరించారు. అదే సమయంలో ఒక్క నగరంలోనే కంపెనీలన్నీ రావడం వల్ల ఒకే చోట అభివృద్ధి జరిగిందని...ఇది ఆశించదగినది కాదని చెప్పుకొచ్చారు.
అందుకే ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గతంలోనే ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. ఈ క్రమంలో మరో ముందడుగు వేశారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పలు ఐటీ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. జీ ప్లస్ 5గా నిర్మించే ఈ టవర్ లో మొదటి విడతగా వెయ్యిమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికి భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి.
మరోవైపు ఇప్పటికే వరంగల్ - ఖమ్మం జిల్లాల్లో ఐటీ హబ్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో మహబూబ్ నగర్ - నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. అక్కడ కంపెనీలు ఏర్పాటుచేసేందుకు సైతం పలువురు ముందుకొచ్చారు. మహబూబ్ నగర్ లో కంపెనీల ఏర్పాటుకు 18 సంస్థలు అంగీకారపత్రాలను అందించాయి. ఐటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఎన్నారైలను సైతం ఆకట్టుకుంది. గత ఏడాది పలువురు ఎన్నారైలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి తమ ఆసక్తిని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రూరల్ టెక్ పాలసీలోని ఆకర్షణీయ అంశాలు ఆకట్టుకున్నాయని ఎన్నారైలు సంతోషం వ్యక్తంచేశారు.
కాగా, ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ అనుసరిస్తున్నతీరుకు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తీరుకు స్పష్టమైన తేడా ఉందని అంటున్నారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు కేటీఆర్ ముందుకు సాగుతున్నారని... అయితే...విశాఖ - అమరావతి కేంద్రంగానే ఐటీ - ఐటీ అనుబంధ పరిశ్రమలు వచ్చేందుకు లోకేష్ కృషిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
ఇదిలాఉండగా..కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ కు వీలైనన్ని ఎక్కువ కంపెనీలను రప్పించేందుకు మంత్రులు కేటీఆర్ - ఈటల రాజేందర్ - కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ - ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపారు. మొత్తం ఆరు కంపెనీలు తమ శాఖలను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చినట్టు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో ఆస్ట్రేలియా మెల్ బోర్న్ కు చెందిన నేవి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వందమందికి - యూఎస్ ఏ అట్లాంటాకు చెందిన ఎస్-2 ఐటీ గ్రూపు అల్ పరేట్ట 50 మందికి - టెక్సాస్ కు చెందిన టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ 100 మందికి - కరీంనగర్ కు చెందిన వే ఐటీ సొల్యూషన్స్ 40 మందికి - హైదరాబాద్ కు చెందిన సంస్కృతి సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ 50 మందికి - హైదరాబాద్ కు చెందిన టీజే నోవండీ ఎల్ ఎల్ పీ 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సోమవారం మంత్రికి ఒప్పంద పత్రాలు ఇస్తాయని చెప్పారు.