Begin typing your search above and press return to search.

కథన రంగంలోకి కేటీఆర్‌.. రేపటినుంచే

By:  Tupaki Desk   |   5 March 2019 2:27 PM GMT
కథన రంగంలోకి కేటీఆర్‌.. రేపటినుంచే
X
తెలంగాణ భావి నాయకుడిగా కేటీఆర్‌ ని ప్రొజెక్ట్‌ చేసే టైమ్ దగ్గరపడింది. ఇన్నాళ్లు తండ్రి చాటు నాయకుడిగా ఉన్న కేటీఆర్‌ ఇకనుంచి టీఆర్‌ ఎస్‌ పార్టీకి అన్నీ తానై వ్యవహరించే సమయం వచ్చేసింది. రాబోయే లోక్‌ సభ ఎన్నికల కోసం టీఆర్‌ ఎస్‌ పార్టీ తరపున కేటీఆర్‌ ప్రచారంలోకి దిగబోతున్నారు. కేసీఆర్‌ కు బాగా అచ్చొచ్చిన కరీంనగర్‌ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు.

కేసీఆర్‌ తర్వాత లీడర్ కేటీఆర్‌. ఇది ప్రస్తుంతం. కానీ గతంలో కేసీఆర్‌ తర్వాత పార్టీలో ఎవరంటే హరీష్‌ రావ్‌ పేరే విన్పించేది. అందుకే.. ఒక్కొక్కటిగా హరీష్‌ ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలవడం ద్వారా.. అవన్నీ కేటీఆర్‌ వల్లే వచ్చిందనే ఫీలింగ్‌ ప్రజల్లో కల్పించారు కేసీఆర్‌. ఆ తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ ఎస్‌ విజయపతాకం ఎగురవేసింది. ఇది కూడా కేటీఆర్‌ క్రెడిట్‌ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే రెండు ఎన్నికలు పూర్తి చేశాడు. ఇక మిగిలి ఉంది లోక్‌సభ ఎన్నికలు. ఇది కూడా పూర్తైతే..అన్ని ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ కు విజయం సాధించి పెట్టిన లీడర్‌ అవుతాడు కేటీఆర్‌. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే.. కేటీఆర్‌ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. హరీష్‌ గ్రాఫ్‌ ఒక్కో మెట్టూ పడిపోతుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీఆర్‌ ఎస్‌ 16 సీట్ల టార్గెట్‌ తో బరిలోగి దిగుతుంది. ఈ 16 సీట్లు సాధిస్తే.. కేటీఆర్‌ ఆధిపత్యానికి అడ్డుచెప్పే గొంతు - నాయకుడు టీఆర్‌ ఎస్‌ పార్టీలో ఉండకపోవచ్చు. అందుకే కేటీఆర్‌ కూడా 2019 లోక్‌ సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత వస్తోన్న ఎన్నికలు కావడంతో.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ ని అగ్రపథాన నిలబెట్టి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నారు కేటీఆర్‌.