Begin typing your search above and press return to search.

కాకరేపుతోన్న కేటీఆర్ ట్వీట్ .. 'దొంగలముఠా' అంటూ బండి సంజయ్ కౌంటర్ !

By:  Tupaki Desk   |   21 May 2021 5:30 AM GMT
కాకరేపుతోన్న కేటీఆర్ ట్వీట్ .. దొంగలముఠా అంటూ బండి సంజయ్ కౌంటర్ !
X
దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి జోరు కొనసాగుతున్న సమయంలోనే దేశం లో మరో వ్యాధి కలకలం సృష్టిస్తుంది. కరోనా మహమ్మారి నుండి ఇంకా పూర్తిగా కోలుకోకమునుపే బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ భయపెడుతోంది. కరోనా నుండి కోలుకున్న వారి ప్రాణాలను కూడా తీసుకుపోతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశం తో పాటుగా ఏపీ , తెలంగాణ లో కూడా ఈ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో చాలా రాష్ట్రాలు ఆ ఫంగస్ కి అనుగుణంగా పేషెంట్లకు చికిత్స ను చేస్తున్నాయి. ఈ ఫంగస్ ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడుతోన్న వారు హైదరాబాద్ లో రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఈ ఫంగస్ భారిన పడిన వారికి సపరేట్ గా ట్రీట్మెంట్ అందించడానికి ప్రత్యేక వార్డులను సైతం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ ఫంగస్ ను నివారించడానికి ఉద్దేశించిన చికిత్సలో యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ కీలకంగా మారింది.

దీనితో ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌ కు డిమాండ్ భారీగా పెరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వం రేషనలైజ్ చేసింది. ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో కేటాయించాలనేది నిర్ణయించింది. దీనిపై ఓ జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో అధిక వాటా మహారాష్ట్ర, గుజరాత్‌ లకే దక్కింది. మహారాష్ట్ర-16,500, గుజరాత్-15,000 ఇంజెక్షన్లను కేటాయించింది. ఈ జాబితాలో తెలంగాణ వాటా 1,050. తెలంగాణ కి కేటాయించిన దానిపై మంత్రి కేటీఆర్ కేంద్రం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఈ ఫంగస్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి అని , ఈ నేపథ్యంలో ఇంత తక్కువ డోసులు ఇస్తే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేవలం 1,050 మాత్రమే మంజూరు చేసిందని నిలదీశారు. గుజరాత్‌ కు 15,000 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను కేటాయించిందని గుర్తు చేశారు. మొత్తంగా ఏ ప్రతిపాదికని తీసుకోని వీటిని కేటాయించారు అంటూ కేంద్రం పై ఫైర్ అవుతూ ఓ ట్విట్ చేశారు. ఆ ట్విట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. దీనిపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.


కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్‌ ఫోర్స్‌ ఓ దొంగలముఠాలా తయారైందని బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ లో అనుభవం ఉన్న వారిని నియమించుకోవాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా కేసీఆర్ సర్కార్ ప్రవర్తించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండే వ్యాక్సిన్లు ఎలా ఉపయోగించాలో తెలివి లేదు గానీ.. కేంద్రం టీకాలను ఇవ్వట్లేదంటూ ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తోన్న కేసీఆర్, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను ఎందుకు చేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. మేము ఇప్పటికే హాస్పిటల్స్ పర్యటనలు చేసాం అని , కేసీఆర్ ఇప్పుడు ప్రారంభించారని అన్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అనుగుణంగా సిబ్బంది ఉండట్లేదని, దీనివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పేషెంట్ల కుటుంబ సభ్యులే ప్రమాదకరమైన కోవిడ్ వార్డుల్లో సేవలు చేస్తున్నారని అన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తో మరోసారి తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది.