Begin typing your search above and press return to search.
కేటీఆర్ ట్వీట్: ప్రేరణగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్
By: Tupaki Desk | 18 Jun 2021 4:30 AM GMTకేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇటీవలే జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నోస్టిక్ హబ్స్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు. ఇందులో ప్రజలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని చెప్పారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తనమూనాలను సేకరించి సెంట్రల్ హబ్ కు పంపిస్తారని.. అక్కడ ఆ నమూనాలను పరీక్షించి నేరుగా రోగి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. హార్డ్ కాపీలను కూడా పంపనున్నట్టు తెలిపారు.
ఇక వీటికి ప్రజల ఆదరణ బాగా ఉండడంతో మరో 16 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్లలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్.. ఈ బృహత్తర కార్యక్రమానికి కృషి చేసిన ఆరోగ్యశాఖ కమిషనర్ కరుణ, డాక్టర్లలకు అభినందలు తెలిపారు