Begin typing your search above and press return to search.
ఫుల్ టెన్షన్ లో... కేటీఆర్ ఫన్నీ ట్వీట్!
By: Tupaki Desk | 28 Nov 2017 6:54 AM GMTటీఆర్ ఎస్ యువనేత - తెలంగాణ కేబినెట్ లో యువ మంత్రిగానే కాకుండా సీఎం తర్వాత సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్న కల్వకుంట్ల తారకరామారావు వ్యవహార సరళి నిజంగానే ఆసక్తికరంగా మారిపోయింది. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు - మరోవైపు కీలక మంత్రిత్వ శాఖల నిర్వహణ - ఇంకోవైపు సోషల్ మీడియాలో ప్రజల స్పందనకు చాలా వేగంగా ప్రతిస్పందిస్తున్న తీరు... మొత్తంగా కేటీఆర్ చాలా బిజీగా మారిపోయారు. ఎంత బిజీగా అంటే... క్షణకాలం కూడా తీరిక లేనంతగా. అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. అయితేనేం... ఎక్కడున్నా - ఎంత బిజీగా ఉన్నా కూడా జనంతో మమేకమయ్యే విషయాన్ని మాత్రం ఆయన మరిచిపోరు. దగ్గరగా ఉంటే... నగర వీధుల్లోకి వచ్చేస్తారు. దూరంగా సోషల్ మీడియాలో హలో చెబుతారు. ఇలా రోజు రోజుకు బిజీ షెడ్యూల్ పెరుగుతున్నా... జనంతో మమేకమయ్యే విషయంలో మాత్రం కేటీఆర్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు. ప్రస్తుతం హైదరాబాదులో రెండు కీలక ఘట్టాలకు తెర లేసింది.
ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యవహారాలన్నీ కేటీఆర్ ఆధ్వర్యంలోని పురపాలక శాఖే పర్యవేక్షిస్తోంది. సో... కేటీఆర్ ఫుల్ బిజీ. అంతేనా... ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కూడా ఈ రోజే హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఈ సదస్సులో పాలుపంచుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ఇప్పటికే హైదరాబాదు చేరుకున్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాంకాతో పాటు చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు వందల సంఖ్యలో హాజరుకానున్నారు. ఇందుకోసం హైదరాబాదును తెలంగాణ సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పరిశ్రమల శాఖా మంత్రి హోదాలో ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత కూడా ఇప్పుడు కేటీఆర్ పైనే పడింది.
అంటే రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతుంటే... ఆ రెండింటి బాధ్యతలతో కేటీఆర్ కు ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ నెత్తిన పడిపోయింది. అయితే పనిలో రాక్షసుడిగా వ్యవహరించే కేటీఆర్ ఈ రెండింటినీ సమర్ధంగానే పర్యవేక్షిస్తున్నారు. మరికాసేపట్లో ఈ రెండు కార్యక్రమాలకు తెర లేవనుంది. ఇలాంటి కీలక తరుణంలో కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. అసలు ఇప్పుడు తాను ఎంత బిజీగా ఉన్నానన్న విషయాన్ని చెబుతూనే... అంతటి బిజీలో కూడా తానెంత చలాకీగా ఉంటానన్న విషయాన్ని కూడా ఆయన చెప్పేసి ఫన్ క్రియేట్ చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతికొద్ది కాలంలో అత్యంత బిజీగా గడుపుతున్న రోజు ఇదేకావచ్చునని ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు దాదాపుగా వైరల్ గా మారిపోయిందనే చెప్పాలి.
ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే... ‘‘మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలో అత్యంత బిజీగా గడుపుతున్న రోజు ఇదే అనుకుంటా... పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో ప్రారంభం - ఐటీ పరిశ్రమల శాఖలకు జీఈఎస్ 2017 అతిపెద్ద ఈవెంట్లు. అంతేకాదు.. ఎవరైనా స్టైలిష్ గా రెడీ అవ్వాలని కోరుకునే రోజుల్లో ఇదికూడా ఒకటి... అయితే ఏం ధరించాలా అని ప్యాక్ చేసుకుంటూ టైమ్ వేస్ట్ చేసే రోజుమాత్రం కాదు ఇది...’’ అని పోస్టు చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చేసింది. కేటీఆర్ కు ‘‘ఆల్ ది బెస్ట్’’ చెబుతూ కొందరు స్పందించారు. కొంతమంది గతంలో కేటీఆర్ సూటు ధరించిన ఫోటోలు పెట్టి ‘‘ఇది వేసుకో అన్నా.. సూపర్ ఉంటది’’ అని కామెంట్ చేస్తే... మరి కొందరు ‘‘అన్నా... తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పోచంపల్లి చేనేత చొక్కాలు వేసుకో’’ అంటూ సలహా ఇవ్వడం విశేషం. ఏది ఏమైనా... ఒకే సమయంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలను కేటీఆర్ ఎలా నిర్వహిస్తారోనన్న టెన్షన్ ప్రజల్లో కలగకుండా కేటీఆర్ ఈ ఫన్నీ టాస్క్‌కు తెర తీసినట్లుగా విశ్లేషణ సాగుతోంది.