Begin typing your search above and press return to search.
కేటీఆర్ ట్వీట్ తో ఉత్తమ్ మైండ్ బ్లాంక్
By: Tupaki Desk | 29 Nov 2018 1:47 PM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పోరు సందర్భంగా కాంగ్రెస్... టీఆర్ ఎస్ మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నేతలు పంచ్ డైలాగ్స్ తో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ ఎస్ ని ఎదుర్కొనేందుకు బద్ధశత్రువులుగా ఉన్న కాంగ్రెస్..టీడీపీ ఒక్కటయ్యాయి. మహాకూటమి పేరిట టీడీపీ - కాంగ్రెస్ - సీపీఐ - జనసమితిలు పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు - ఏపీ సీఎం - టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై ప్రచారం చేయడంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ పర్యటనకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన అనంతరం తాను బస చేసే హోటల్ కు వెళ్తున్న సందర్భంగా బస్సులో తీసిన ఓ ఫొటో ఉత్తమ్ గాలి తీసేసేలా మారింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్..నవంబర్ 29వ తేదీ గురువారం ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేయడంతో అది వైరల్ గా మారిపోయింది. బస్సులో ముందు సీటులో రాహుల్ గాంధీ - చంద్రబాబు కూర్చుని ఉంటే...వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడి ఉన్నారు. ఆ ఫొటోను చూస్తే తెలంగాణ భవిష్యత్తు అర్థం అవుతోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వెన్నెముక లేని స్కాంగ్రెస్ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి. ఆత్మగౌరవం లేని వాళ్లు’... అంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.