Begin typing your search above and press return to search.
బెంగుళూరు వరదలపై కేటీఆర్ వరుస ట్వీట్లు: వైరల్
By: Tupaki Desk | 6 Sep 2022 6:37 AM GMTసోషల మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే కేటీఆర్ సంచలనాత్మక పోస్టులను పెడుతూ ఉంటారు. ఆయన పెట్టిన న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ పెట్టిన ఓ పోస్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగుళూర్ లో ఇటీవల కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది.
నగరం మొత్తం నీటితో నిండిపోయిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై రాజకీయంగా చర్చ సాగుతోంది. ఎన్నో ఆశలతో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వారితో నగరాలు నిండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరిని ట్యాగ్ చేయడంతో ఈ న్యూస్ సంచలనంగా మారింది.
'పట్టణాల్లో, నగరాల్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతోంది. దేశంలోని చాలా మంది పల్లెలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. నగరాలు మొత్తం జనాభాతో కిక్కిరిసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న వర్షం కురిసినా డ్రైనేజీలోని నీరు రోడ్లపైకి వస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. దీనికి బాధ్యులెవరు..? పాలకులు ఏం చేయాలి..? 'అని కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేసి మెసేజ్ పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నడిపించేది పట్టణాలు, నగరాలేనని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వేగవంతమైన పట్టణీకరణకు తోడుగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేంద్రం సమకూర్చాలని కోరారు. పట్టణాలను, నగరాల్లో వర్షబాధితులు లేకుండా చూడాలన్నారు. చిన్న వర్షానికే కాలనీలు, రోడ్లు చెరువుల్లా మారుతున్నాయని, వాటర్ మేనేజ్మెంట్ సిస్టం ను తయారు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. ప్రతీసారి వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు చూడడం కామన్ కావచ్చు. కానీ ఒకసారి జరిగిన తప్పిదంతో మరోసారి అలా జరగడకుండా చూడాలన్నారు.
గతంలో హైదరాబాద్ లో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కర్ణాటకకు చెందిన కొందరు జోకులు వేస్తూ ట్వీట్లు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం నేను జోకులు వేయడం లేదన్నారు. దేశంలోని ప్రతీ నగరం, పట్టణంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. దేశంలోని నగరాలన్నీ ఒకే విధంగా ఉండాలని, ఒకరి అనుభవం నుంచి మరొకరు తెలుసుకుని సమస్యల నుంచి బయటపడాలని సూచించారు. నేను చేసిన ట్వీట్ వైరల్ అవుతుందన్న విషయం పక్కనబెట్టి, ఈ సమస్య పరిష్కారానికి మార్గం ఆలోచించాలన్నారు.
ఈ ట్వీట్ ద్వారా హైదరాబాద్ లోని బెంగుళూరు వాసులకు ఇబ్బందులు కలగవచ్చు కానీ సమస్యగురించి బయటకు చెప్పాలన్నదే నా ఉద్దేశం అని కేటీఆర్ అన్నారు. అయితే బెంగుళూరు వరదలపై అవహేళన చేసేవారికి ఇది వ్యతిరేకమైన పోస్టు అని చెప్పారు. వరద కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ఇటీవల కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.