Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ పై కేటీఆర్ యూటర్న్

By:  Tupaki Desk   |   17 March 2019 9:00 AM GMT
ఏపీ పాలిటిక్స్ పై కేటీఆర్ యూటర్న్
X
ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను ఇటీవలే చేతులు జోడించి మరీ వేడుకున్న సంగతి తెలిసిందే.. దీంతో ఈ వ్యాఖ్యలు పతాక శీర్షిక అయ్యాయి. మరి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా డేటా చోరీ కేసు తీగను లాగడం.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ను కేటీఆర్ కలవడంతో కేసీఆర్ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాడన్న చర్చ సాగింది.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ ఫైట్ కేసీఆర్ తోనేనని.. వైసీపీ వెనుకుండి కేసీఆర్ నడిపిస్తున్నాడని విమర్శలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతారా అన్న ప్రశ్నకు స్పందించారు. ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర లేదని.. టీఆర్ఎస్ ఒక పార్టీగా ఏపీలో వేలు పెట్టనవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లోకి వెళ్లడానికి తమకు ఆసక్తి కూడా లేదని కుండబద్దలు కొట్టారు.

అయితే ప్రస్తుతం ఏపీలో చంద్రబాబును సాగనంపడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఎన్నికల తర్వాత బాబు కనుమరగవ్వడం ఖాయమన్నారు. ఏపీలో ఈసారి టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ అంటున్నారని.. కానీ ఏపీలో జనసేన కూడా బలంగా ఉందని.. త్రిముఖ పోటీ ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలా జనసేనాని బలంపై తక్కువ అంచనావేస్తున్న వారికి కేటీఆర్ వ్యాఖ్యలు జనసేనకు బూస్ట్ గా మారాయి.