Begin typing your search above and press return to search.
కేటీఆర్ నోట డీజే టిల్లు మాట ! అట్లుంటది మనతోటి !
By: Tupaki Desk | 21 April 2022 6:27 AM GMTఏ మాటకు ఆ మాట ఇవాళ తెలంగాణ యాసకు సమున్నత గౌరవం దక్కుతుందంటే అందుకు కారణం కేసీఆర్.. ఇదే మాట ఎవ్వరు అన్నా ఒప్పుకోవాల్సిందే ! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సంబంధిత సంస్కృతి, భాష, యాస మరియు స్థానిక కళలపై మునుపటి కన్నా ఎక్కువ గౌరవ భావం పెంపొందించుకోవడంతో పాటు, సంబంధిత వ్యక్తులను కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన కృషి, తెలంగాణ జాగృతి చేసిన కృషి ఎంతగానో ఫలించింది అని చెప్పేందుకు సందేహాలు అవసరమే లేదు.
ఇవాళ ఆంధ్రాలో కూడా తెలంగాణ సంస్కృతులపై మునుపటి కన్నా ఎక్కువ అవగాహన కలిగింది ప్రజలకు ! అదేవిధంగా మొగులయ్య లాంటి కళాకారులను కేసీఆర్ ఆదరిస్తున్న తీరు దేశం యావత్తు ఆలోచింపజేసేలా చేస్తోంది.
ముఖ్యంగా కేటీఆర్ చెప్పిన విధంగా సినిమా వాళ్లంతా ఇవాళ ఈ ప్రాంత భాషకు, సంస్కృతికి ఇస్తున్న ప్రాధాన్యం ఆయా చిత్ర విజయాలకు ఎంతో దోహదం అవుతోంది. అందుకే కేటీఆర్ అట్లుంటది మనతోటి అంటున్నరు.
నిన్నటి వేళ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పై మళ్లీ పోరు స్వరం వినిపించారు. అంతేకాదు ఆయన నోట డీజే టిల్లు డైలాగ్ వినిపించింది. ఇవాళ బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కు రుణపడి పోయి ఉండాలని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ కనుక కృషి చేయకుండా ఉంటే వీళ్లంతా ఏమయిపోయేవారో అని ఘాటు వ్యాఖ్యలు కొన్ని చేశారు. దీంతో టీపీసీసీ తో పాటు టీబీజేపీ అధినాయకత్వాలు తమ పదవులు కేసీఆర్ వేసిన భిక్ష అన్న అర్థం వచ్చే విధంగా కేటీఆర్ మాట్లాడడంపై మండిపడుతున్నాయి.
ఇదే సందర్భంలో మరికొన్ని మాటలు కూడా చెప్పారు. తెలంగాణ సాధన వల్లే తెలుగు సినిమా వాళ్ల భాష మారిందని, ఇవాళ తెలంగాణ యాస వినబడకపోతే ఆయా సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయని, ఆ విధంగా భాషకు సమున్నత గౌరవం తీసుకువచ్చామని చెబుతూ అట్లుంటది మనతోటి అన్న డైలాగ్ వినిపించి సభికుల్లో ఉత్సాహం నింపారు. హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వర్కింగ్ ప్రెసిండెంట్ హోదాలో హాజరై ఆద్యంతం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.