Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు మీడియా అంటే గౌరవమా?భయమా?
By: Tupaki Desk | 8 Aug 2017 11:31 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు మాట్లాడే అవకాశం దొరికిందంటే చాలు...ఆకట్టుకునేలా ప్రసంగించడానికి, అదే రీతిలో ఎదురుదాడి చేయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయరు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువయింది. కల్వకుంట్ల వారి ఫ్యామిలీ బలం.....బలమైన వాణి అని చాలా మంది చెప్తుంటారు. ఇబ్బందికరమైన ప్రశ్నలను సైతం ఎదుర్కోవడమే కాకుండా ఏమాత్రం తొత్రుపాటు గురికాకుండా ఎదుర్కోవడం కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యేకత. అలాంటి కుటుంబ వారసుడైన కేటీఆర్ తాజాగా మీడియాను గౌరవిస్తున్నాను అనే పేరుతో తన సొంత ఇలాకాలో వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా కేటీఆర్ ఇమేజ్ పై సందేహం కలిగేలా ఉందనే చర్చ జరుగుతోంది.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గంలోని నేరెళ్లలో ఇసుక మాఫియా కారణంగా దళితులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీ - వామపక్షాలు సహా అంతా నేరెళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించాయి. అయితే ఈ ఘటన జరిగిన దాదాపు 15 రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గానికి కేటీఆర్ ఈరోజు వెళ్లారు. వేములవాడ ఆసుపత్రిలో నేరేళ్ల బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అయితే మంత్రి కేటీఆర్ పర్యటనలకు ఎప్పుడైనా ముందస్తుగా సమాచారం ఉంటుంది. అలాంటిది తాజా కార్యక్రమానికి మాత్రం ఏమాత్రం సమాచారం లేదు. బాధితులను పరామర్శించిన అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ మీడియాను గౌరవించడం వల్లే బాధితులను పరామర్శించే సమయంలో తాను సమాచారం ఇవ్వలేదన్నారు. ఇటు మీడియాకు, అటు బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనేది తమ ఉద్దేశమని కేటీఆర్ వివరించారు. అయితే కేటీఆర్ చెప్పినట్లుగా ఇది మీడియాను గౌరవించినట్లుగా లేదని....బాధితుల ఆగ్రహం ఎక్కడ మీడియా బయటకు చెప్తుందోనని కేటీఆర్ భయపడినట్లు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేరేళ్లలో జరిగిన సంఘటన బాధాకరమని, ఇలా జరగాలని ఎవరూ కోరుకోరని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు దయతలచి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఇలాంటి సంఘటనలను తాము ప్రోత్సహించామని తెలిపారు. అలాంటి పద్దతి నాడు లేదని, నేడూ లేదని క్షణికావేశంలో లారీలు కాల్చడం - కేసులు పెట్టడం జరిగిందని వివరించారు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించమని కేటీఆర్ తేల్చిచెప్పారు. గత 50 ఇళ్లలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం - ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే ఇక ఇసుక మాఫియా ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ఇసుక ద్వారా 50 ఏళ్ళ ఆదాయం మూడేళ్లలో తెచ్చామన్నారు. మిడ్ మానేరును శరవేగంగా ఖాళీ చేయించడానికి ఇసుక తీస్తున్నామని వివరించారు. కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారని అయినప్పటికీ దళితులపైనే పెట్టడం అని ఆరోపించడం తప్పని కేటీఆర్ చెప్పారు. పోలీసులు మమ్మల్ని ఎందుకు హింసించారని బాధితులు ప్రశ్నించారని వారి ఆవేదనను గౌరవించి డీఐజీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజకీయ విమర్శలు సరికాదని..వారి తిట్లు దీవెనలు గానే భావిస్తానని చెప్పారు.
తన నియోజకవర్గం ప్రజలకు- తనకు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని కేటీఆర్ అన్నారు. వచ్చిన వారంతా టూరిస్టులని ఎద్దేవా చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్ళీ మాకు ఓటు వేయమనే కుసంస్కారం మాది కాదని అన్నారు.అసంబద్ద వాదనలు మాని, ప్రజల మేలు కోసం పనిచేయాలని విపక్షాలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఒప్పుకోదని, బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. మీడియా కూడా జరగని తప్పును తప్పుగా చూపించవద్దు. సంయమనం పాటించాలన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని మంత్రి కేటీఆర్ కోరారు.