Begin typing your search above and press return to search.
కేటీఆర్ వర్సెస్ రామచంద్రరావు.. ట్విటర్ తో పరస్పర పంచ్ లు
By: Tupaki Desk | 1 March 2021 11:30 AM GMTతెలంగాణ అధికార పక్ష టీఆర్ఎస్ కు బీజేపీ మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు.. పోటాపోటీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పన ప్రధాన అంశంగా మారింది. ఈ అంశాన్ని బీజేపీ నేతలు తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాల్ని కల్పించామని చెబుతున్న టీఆర్ఎస్ కు సవాలు విసురుతూ.. అన్ని జాబులు ఎక్కడెక్కడ ఇచ్చారో చూపించండంటూ ప్రశ్నిస్తున్నారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు గన్ పార్కు వద్ద కేటీఆర్ కోసం వెయిట్ చేస్తే.. ఈ రోజు (సోమవారం) బీజేపీ నేతలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెయిట్ చేశారు.
బోలెడన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పే కేసీఆర్ సర్కారు.. నిజంగా ఎన్ని ఉద్యోగాల్ని ఇచ్చిందన్న విసయాన్ని చెప్పేందుకు తమతో చర్చకు వచ్చే సాహసం చేస్తారా? అని బీజేపీ నేతలు సవాలు విసురుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే అంశాన్ని తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ సర్కారుఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు.
ఉస్మానియాకు చర్చకు రావాలని ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు సవాలు విసరగా.. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో తాను చెబుతానని కేటీఆర్ అన్నారు. సవాలులో భాగంగా సోమవారం ఉదయం ఉస్మానియాకు వెళ్లిన రామచంద్రరావు.. కేటీఆర్ కోసం వెయిట్ చేశారు. తాను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నానని.. ఎక్కడున్నావు మిస్టర్ కేటీఆర్? అంటూ ట్విటర్ వేదికగా రామచంద్రరావు ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ఊహించని రీతిలో చురకలు అంటించారు.
తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని.. జన్ ధన్ ఖాతా ఉన్న ప్రతిఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పారు కదా? వీటిని ఎంతవరకు నెరవేర్చారా? అన్న సమాచారాన్ని సేకరించే పనిలో బిజీగా ఉన్నాను.. దీనికి ఎన్ డీఏ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ డీఏ అంటే అసలు.. నో డేటా అవైలబుల్ అని ట్వీట్ చేశారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఉంటే షేర్ చేయాలని కోరిన తీరు రెండు పార్టీల మధ్య మరింత వేడెక్కే వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి.