Begin typing your search above and press return to search.
కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. భవిష్యత్ సీఎం ఎవరు?
By: Tupaki Desk | 29 Aug 2020 10:30 AM GMTరాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకసారి.. రెండుసార్లు.. పోనీ మూడు సార్లు గెలుస్తారు? మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ మంచి పరిపాలన దక్షుడిగా నిరూపించుకున్నాడు. అందుకే హ్యాట్రిక్ కొట్టి మూడు సార్లు గెలిచాడు. నాలుగోసారి ప్రజలే ఓడించారు. ఇలా ఏ రాజకీయ పార్టీకైనా కనీసం ఐదేళ్లే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత నచ్చితే ఉంటారు. లేదంటే పోతారు.
ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పాలన నచ్చి వరుసగా రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత ఖచ్చితంగా వ్యతిరేకత రావడం సహజం. అందుకే 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెల్లుబుకి గెలవడం కష్టమేనంటున్నారు.అందుకే భవిష్యత్ సీఎంగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ పేరును నేతలు ప్రతిపాదిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ లోనూ యువ నేత రేవంత్ రెడ్డి దూసుకొస్తున్నారు. ఆయనను పీసీసీ చీఫ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ తరుఫున సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డినే. ఈ క్రమంలోనే ఇద్దరు యువ నేతలు కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్యనే తెలంగాణ సీఎం కుర్చీ దోబూచులాడుతుందని చెప్పవచ్చు. మరి భవిష్యత్ సీఎం ఎవరనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
తాజాగా ‘తుపాకీ.కామ్’ నిర్వహించిన పోల్ సర్వేలో ఇదే ప్రశ్నను ప్రజలు, పాఠకుల ముందు ఉంచాం. అందులో కేటీఆర్ భవిష్యత్ సీఎం అని 55.74శాతం మంది ఓటు వేశారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని 44.26 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ ఇద్దరూ యూత్ లీడర్ల మధ్య వ్యత్యాసం కేవలం దాదాపు 10శాతమే ఉండడం విశేషం. అది పెద్ద సమస్య కాదు..
సో 2024 వరకు ఇద్దరికీ తెలంగాణ సీఎం అయ్యే చాన్స్ ఉందని పాఠకులు అభిప్రాయపడుతున్నారు. అందులో ఎవరికి పీఠం దక్కుతుందనేది వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తేలుతుంది. అప్పటివరకు మనం ఎదురుచూడడమే..