Begin typing your search above and press return to search.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని అన్ని రోజులు చేయాలంటున్న కేటీఆర్
By: Tupaki Desk | 14 Feb 2022 5:51 AM GMTకొత్త ట్రెండ్ కు తెర తీశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా ఇప్పటికే తన హవాను నడుపుతున్నారన్న విమర్శలు కేటీఆర్ మీద వినిపిస్తూ ఉంటాయి. తనపై వచ్చే విమర్శలకు.. ఆరోపణలకు ఏ రోజూ సమాధానం ఇవ్వని కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన తమ పార్టీ క్యాడర్ కు ఆసక్తికరమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడు కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని ఈసారి మూడు రోజులు నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో దానికి రెండు రోజుల ముందు నుంచే వేడుకల్ని నిర్వహించాలని.. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్ని చేపట్టాలని కోరారు. పెద్ద సారు పుట్టిన రోజు వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించాలన్న విషయాన్ని చిన్నసారు చెప్పిన తీరుతో పార్టీ వర్గాలకు ఇప్పుడో తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. మాటకు మూడు రోజులు వేడుకలు నిర్వహించటం ఓకే కానీ.. దానికయ్యే ఖర్చును తలుచుకుంటేనే జడుచుకునే పరిస్థితి.
కేసీఆర్ పుట్టినరోజు వేడుకను మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని కోరుతున్న కేటీఆర్.. తమ ఇంట్లోఎన్ని రోజుల ముందునుంచి నిర్వహిస్తారో క్లారిటీ ఇస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా తమ పార్టీ వ్యవహరమేనని.. అలాంటప్పుడు ప్రశ్నలు అవసరం లేదని అనొచ్చు కానీ.. ఈ తరహా ట్రెండ్ ఏ మాత్రం స్వాగతించలేనిదిగా మారుతుందని చెప్పాలి.
జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన వేడుకల్నే రోజు జరిపే దేశంలో.. తమ పార్టీ అధినేత పుట్టిన రోజునుమూడు రోజులు ఘనంగా చేపట్టాలన్న కేటీఆర్ మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మూడు రోజులని చెప్పిన కేటీఆర్..రానున్న రోజుల్లో పెద్ద సారు బర్త్ డేను వారోత్సవంగా నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సొంత పార్టీకి చెందిన నేతలు లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.