Begin typing your search above and press return to search.
ఆంధ్రా రాజకీయాల్లోకి దిగుతాం..బాబు సంగతి తేలుస్తాం
By: Tupaki Desk | 1 Dec 2018 9:59 AM GMTఊహించిందే జరిగింది. కొద్దిరోజులుగా చర్చల్లో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ రాజకీయ విస్తరణ అంశం తాజాగా ఖరారు అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి రాబోయే కాలంలో తెలుగు రాష్ర్టాల్లో తన ముద్ర వేసుకుంటుందనే చర్చ జోరుగా సాగడం నిజం చేస్తూ....తాజాగా ఈ మేరకు టీఆర్ ఎస్ నేత - మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మూసాపేటలోని భరత్ నగర్ లో జరిగిన మన హైదరాబాద్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే అమరావతి దాకా తరిమికొట్టిన చంద్రబాబుకు.. సరైన సమయంలో సీఎం కేసీఆర్ తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తామని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. అవసరమైతే ఆంధ్రాలో కూడా వేలు పెట్టేందుకు వెనుకాడమని కేటీఆర్ స్పష్టం చేశారు. `ఇటీవలే పేపర్లలో ప్రకటనలు చూస్తున్నాం. ఆ ప్రకటనలకు ఎవరూ డబ్బు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ సీట్లు పంచొచ్చు.. చంద్రబాబు కోట్లు పంచొచ్చు.. ఓట్లు వేసేది మాత్రం మనం. కాబట్టి ఓటు ద్వారా కూటమికి తగిన బుద్ధి చెప్పాలి` అని కేటీఆర్ ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ తో తాము ఏనాడూ తగాదాలు కోరుకోలేదని కేటీఆర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను - ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ వ్యవహరించలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని గుర్తుచేశారు. `` చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాడు. ఇక రాబోయే రోజుల్లో అవసరమైతే రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం. అవసరం వచ్చినప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో కూడా తాము వేలు పెడుతాం. ఫెడరల్ ఫ్రంట్ భాగంగా ఆంధ్రాలో మా పట్టు చూపెట్టి.. చంద్రబాబుకు కేసీఆర్ సరైన బుద్ధి చెబుతాం. మీడియా - డబ్బు చుట్టూ చంద్రబాబు రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీడీపీని తరిమికొడుతారనే నమ్మకం ఉంది. రాహుల్ ఎన్ని డ్రామాలు ఆడినా.. బాబు ఎన్ని వేషాలు వేసినా.. ప్రజలు నమ్మరు. అన్ని వర్గాలను ఆదరించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ ను కాపాడుకోవాలి`` అని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒక్క కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - కోదండరాం కలిసి వస్తున్నారు. కానీ సింహం సింగిల్ గానే వస్తోంది.. కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు.
దేశంలోనే హైదరాబాద్ కు ఓ ప్రత్యేకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ``హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన నగరం. టీఆర్ ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో తమ సేవలు విస్తరించాయి.` అని కేటీఆర్ తెలిపారు. ``దేశ జీడీపీలో అధిక శాతం మెట్రో పాలిటన్ నగరాలదే. క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ ది బెస్ట్. ఏడాదిలోనే హైదరాబాద్ మెట్రోలో మూడు కోట్ల మందికి పైగా ప్రయాణించారు. హైదరాబాద్ లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో లైన్ పొడిగిస్తాం. మెట్రోలో ఎలివేటెడ్ బస్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ తెస్తాం` అని అన్నారు.