Begin typing your search above and press return to search.
సీఎం హోదా చూపించే దమ్ము ఆయనదే..
By: Tupaki Desk | 18 Jun 2016 3:33 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు విలక్షణంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆయన వేసే ప్రతి అడుగు విలక్షణంగా.. విభిన్నంగా ఉంటుంది. ఆత్మీయంగా ఉన్నట్లే కనిపించినా.. అంత దగ్గరకు రానట్లుగా ఉండటం.. తన ‘స్థాయి’ని ప్రదర్శించుకునే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఉండటం కనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా ముఖ్య అతిధి వస్తున్నారంటే ఏం చేస్తాం. ఆయన్నురిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ముఖ్యమైన కార్యక్రమాల వరకూ ఆయన వెంటే ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ.. కేసీఆర్ తీరు అందుకు భిన్నం.
ఎంత కీలక అతిధి వస్తున్నా.. దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూనే.. దూరంగా ఉండటం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. రతన్ టాటా లాంటి వ్యాపార వేత్త ప్రభుత్వానికి సంబంధం ఉన్నకార్యక్రమంలో హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వస్తున్నారంటే.. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి హాజరు కావటం ఉంటుంది. కానీ.. కేసీఆర్ వైఖరి వేరుగా ఉంటుంది. ఆయన రాష్ట్రంలోనే ఉన్నా.. ముఖ్యమైన కార్యక్రమాలకు రారు. అలా అని ఆయన కీలకమైన మరేదైనా కార్యక్రమంలో ఉన్నారా అంటే అదీ ఉండదు. ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.
ఎందుకలా అని ప్రశ్నించేవారు ఉండరు. తప్పుగా వేలెత్తి చూపించే వారు కనిపించరు. అందుకేనేమో.. ఆయన తన తీరునుకొనసాగిస్తూ ఉంటారు. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్ వచ్చారు. ఆయన ఎంత కీలకమైన వ్యక్తి అన్నది కేసీఆర్ విందు ఆహ్వానం చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంత కీలకమైన వ్యక్తి.. టీ హబ్ ను సందర్శించటానికి వస్తే.. కేసీఆర్ హాజరు కాలేదు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు.. సంబంధిత శాఖామంత్రి కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుగ్గా కాకుండా ఆయనో సగటు రాష్ట్ర మంత్రిగా చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఒక కీలక కేంద్రమంత్రికి ఒక రాష్ట్ర మంత్రి స్వాగతం పలికిత.. ఆ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి వివరించటమా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
మరి.. ఇలా చేయటం తప్పా? అంటే.. తప్పని నేరుగా చెప్పలేం. కాకుంటే.. ఇంటికి విందుకు పిలిచిన కేసీఆర్.. అధికారిక కార్యక్రమంలో కేంద్రమంత్రి పక్కన ఉంటే మరింత బాగుంటుంది. అందుకు భిన్నంగా ఉండటానికి కారణం.. తన వారసుడైన కొడుకును ప్రమోట్ చేయటమని చెప్పక తప్పదు. అదే సమయంలో తనను తాను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే వీలుంటుందన్న భావనతో అలా చేస్తారని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే కేసీఆర్ కాస్త మారారని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆయన ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కొత్తల్లో కేంద్రం నుంచి ఎవరైనా ప్రముఖుడు వస్తే ఆయన కనీసం కలిసే వారు కాదు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా కొడుకును ప్రమోట్ చేసుకోవటంతో పాటు.. పెద్ద మనిషిగా విందు రాజకీయాలు మొదలెట్టారని చెప్పాలి. ఏమైనా విలక్షణ వైఖరికి కేసీఆర్ కేరాఫ్ అడ్రస్ అన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పకతప్పదు.