Begin typing your search above and press return to search.
కేటీఆర్ సతీమణి టీఆర్ ఎస్ కు ఓటేయరా?
By: Tupaki Desk | 2 Feb 2016 4:08 AM GMTమొన్నామధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట కొన్ని మాటలు కాస్త ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని బాబు ఇంటికి వెళినప్పుడు.. వారితో వదినమ్మ మాట్లాడుతూ.. తన ఓటు టీఆర్ ఎస్ కే అని చెప్పారని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో ఉన్న వదినమ్మ.. తన ఓటును టీఆర్ ఎస్ కు చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యాఖ్యానించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కేసీఆర్ నోటి వెంట ఈ మాట వచ్చిన కొద్దిసేపటికే.. తన ఓటు ఎప్పటికి టీడీపీకే అన్న మాట ఆమె ప్రకటన రూపంలో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ప్రచారం మొత్తాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని నడిపించిన కేటీఆర్ కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గ్రేటర్ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ హైదరాబాద్ నగరం మొత్తం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న మంత్రి కేటీఆర్ ఇంట్లోనే పార్టీకి ఓటు వేయని పరిస్థితి ఉందట. కేటీఆర్ సతీమణికి ఓటు లేకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓపక్కన గ్రేటర్ పరిధిలోని ప్రజల్ని తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్న కేటీఆర్.. ఇంట్లో తన భార్య శైలిమకు ఓటు లేని విషయాన్ని ఎందుకు గుర్తించలేదు?
బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని నందినగర్ లో ఉంటే కేటీఆర్.. ఆయన ఓటు ఇక్కడే ఉంది. అదే సమయంలో ఆయన సతీమణి ఓటు శైలిమకు లేకపోవటం గమనార్హం. ఇక.. శైలిమకు ఓటు ఎక్కడ ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. ఎవరి ఓటు గురించో మాట్లాడే కేటీఆర్.. ముందు తన ఇంట్లోతన భార్య ఓటు పార్టీకి పడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోకపోవటం ఏమిటో అర్థం కాని విషయమే.
చంద్రబాబు సతీమణి ఎవరికి ఓటు వేస్తారనే కన్నా.. సొంతిట్లో తన కోడలు ఓటుపార్టీకి పడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోవటం ఏమిటో..? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఇష్యూ మీద కేటీఆర్ కాస్త వివరణ ఇస్తే బాగుంటుంది. అప్పుడే.. ఇలాంటి వార్తల్లో నిజానిజాలు అందరికి తెలిసే అవకాశం ఉందని టీఆర్ఎస్ ను అభిమానించే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.