Begin typing your search above and press return to search.
జాతీయ హైవే అభివృద్ధికి 500 కోట్లు ... కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి !
By: Tupaki Desk | 1 Oct 2020 4:30 PM GMTతెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గురువారం లేఖ రాశారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 500 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. . నగర పరిధిలో హైదరాబాద్ - విజయవాడ హైవే సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని , హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఈ హైవేకు ప్రత్యేకంగా లెవల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలతో పాటు లేన్ కెపాసిటీని మరింతగా పెంచాల్సిన అవసరం, అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
పుణె-మచిలీపట్నం పట్టణాలను కలిపే ఈ జాతీయ రహదారి నగరంలో అత్యంత కీలకమైన రూట్ల గుండా సాగుతుంది. హైదరాబాద్ నగరం పరిధిలో అత్యంత రద్దీ ప్రాంతాల గుండా సాగే ఈ హైవేకు ప్రత్యేకంగా లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని, లైన్ కెపాసిటీ మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవల జరిగిన సమావేశంలో పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 500 కోట్ల రూపాయలు ఖర్చుకాగల డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ తయారు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నందున.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని విస్తరించాల్సిన అవసరాన్ని కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చొరవతో నగరానికి నాలుగు అర్బన్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే అంబర్‌పేట ఫ్లై ఓవర్‌కు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక అడ్వాంటేజ్ వలన నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.