Begin typing your search above and press return to search.

అమరావతికి ‘మలేషియా’ అందాలు

By:  Tupaki Desk   |   26 July 2016 7:53 AM GMT
అమరావతికి ‘మలేషియా’ అందాలు
X
ఏపీ రాజధాని అమరావతికి ‘మలేషియా’ అందాలు జత కట్టనున్నాయి. 900 ఎకరాల్లో ఏర్పాటు చేసే ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నమూనాలకు మలేషియాకు చెందిన ఆర్డీ హారిన్ ఇంటర్నేషనల్ కంపెనీ కొన్ని ఆకృతుల్ని సిద్ధం చేసింది. వీటికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను తాజాగా ప్రదర్శించారు. బౌద్ధం.. తెలుగు సంస్కృతులను కలగలిపి ప్రభుత్వ భవనాల్ని రూపొందించటం ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పాలి.

అసెంబ్లీ భవనానికి ‘ది సేక్రెడ్ అసెంబ్లీ’.. సచివాలయానికి ‘పీపుల్స్ సెక్రటేరియేట్’ అని.. హైకోర్టుకు ‘టెంపు ఆఫ్ జస్టిస్’ అన్న పేర్లతో ఈ భవనాల ఆకృతుల్ని రూపొందించారు. ఒకదానితో మరొకటి సంబంధం లేనట్లుగా ఉంటూ.. ఆయా భవనాలకు తగ్గట్లుగా వీటి ఆకృతులు కళాత్మకంగా ఉన్నాయి. ఇక.. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాలకు సంబందించిన ఏరియల్ వ్యూను కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో చూపించారు.

ప్రస్తుతం ప్రజంటేషన్ ఇచ్చిన ఆర్డీ హారిస్ కంపెనీకి.. మలేషియాలోని పుత్రజయ నగరాన్ని రూపొందించిన అనుభవం కూడా ఉంది. తాజాగా రూపొందించిన ఆకృతుల్లో హైకోర్టు భవనాన్ బౌద్ధ స్థూపాన్ని పోలినట్లుగా ఉండటమే కాదు.. మోడ్రన్ గా ఉండటం గమనార్హం. ఇక.. అసెంబ్లీ భవనాన్ని వాటర్ లిల్లీ షేప్ లో రూపొందించారు. ఈ కంపెనీ ప్రదర్శించిన మూడు భవనాల్లో అసెంబ్లీ ఆకృతి అదిరిపోయిందన్న మాట వినిపిస్తోంది. కొంగొత్తగా ఉండటంతో పాటు.. చాలా భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది. హైకోర్టు ఆకృతి కూడా బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. సచివాలయ భవన ఆకృతి రోటీన్ అన్న మాట వినిపిస్తోంది.