Begin typing your search above and press return to search.

గ్రహణం వేళ.. ఆ గుడిని మాత్రం తెరిచి ఉంచుతారు

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:36 AM GMT
గ్రహణం వేళ.. ఆ గుడిని మాత్రం తెరిచి ఉంచుతారు
X
సూర్య గ్రహణం.. చంద్రగ్రహణ.. ఏదైనా కావొచ్చు. గ్రహణానికి కొన్ని గంటల ముందే దేవాలయాల్ని మూసేయటం చేస్తారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ప్రత్యేక శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆలయాల్ని తెరుస్తారు. అందుకు భిన్నంగా ఏపీలోని ఒక ఆలయాన్ని మాత్రం గ్రహణం వేళలో తెరిచే ఉంచుతారు.

గ్రహణ సమయంలో ఆ ఆలయానికి చెందిన ఆర్చక స్వాములు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇంతకూ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయలో ఉంది. ఆ ఆలయం పేరు కుక్కుటేశ్వరస్వామి క్షేత్రం. గ్రహణం వేళలో ప్రత్యేక అభిషేకాలు.. జపాలను ఆర్చకస్వాములు నిర్వహిస్తుంటారు.

మిగిలిన దేవాలయాలకు భిన్నంగా ఉండే ఈ ఆలయానికి గ్రహణం వేళలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జపాలు చేయించుకుంటారు. పిఠాపురంలో ఉండే ఈ కుక్కుటేశ్వర ఆలయంలో దత్తాత్రేయుని ఆలయం.. వివిధ దత్త అవతారాల మందిరాలు కొలువై ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహుతిక అమ్మవారి ఆలయం కూడా ఉంది. విశేష దినాల్లో.. పండుగల వేళ ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.