Begin typing your search above and press return to search.

ఆయ‌న ఉరిపై పాక్ త‌గ్గింది..ముషర్రాఫ్ కామెంట్!

By:  Tupaki Desk   |   12 April 2017 9:30 AM GMT
ఆయ‌న ఉరిపై పాక్ త‌గ్గింది..ముషర్రాఫ్ కామెంట్!
X
కుల్‌ భూషన్ జాదవ్ ఉరిశిక్షపై ఎట్టకేలకు పాకిస్థాన్‌ వెనక్కి తగ్గింది. జాదవ్‌ కు వెంటనే ఉరిశిక్ష అమలు చేయబోమంటూ ప్రకటన విడుదల చేసింది. క్షమాభిక్ష కోసం అప్పీల్‌ చేసుకోవచ్చని చెప్పింది. అందుకు రెండు నెలల గడువు విధించించింది. బలూచిస్థాన్‌లో గూఢచార్యం చేస్తున్నారన్న ఆరోపణలపై గత ఏడాది జాదవ్‌ ను అరెస్టు చేసిన పాక్‌...రెండు రోజుల కిందట ఆయనకు ఉరిశిక్ష విధించింది. దీన్ని భారత్ గట్టిగా ఖండించింది. ఇరాన్‌ లో జాదవ్‌ ను కిడ్నాప్ చేసి, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించింది. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామని ప్రకటించడంతో.. పాక్‌ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.

భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల‌భూష‌న్ జాద‌వ్‌ కు పాకిస్థాన్ సైనిక కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డం ప‌ట్ల ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ స్పందించారు. పాకిస్థాన్ చ‌ట్టాల ప్ర‌కార‌మే జాద‌వ్‌కు శిక్ష వేసిన‌ట్లు ఆయ‌న ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. గూఢ‌చ‌ర్యం, సంఘ విద్రోహం కేసులో జాద‌వ్‌ను అరెస్టు చేశార‌ని, ఆ కేసును మిలిట‌రీ కోర్టులో విచారించార‌ని, సాధార‌ణంగా నిందితుని త‌ర‌పున లాయ‌ర్ కూడా వాదిస్తార‌ని, పాకిస్తానీయుల‌కైనా, విదేశీయుల‌కైనా ఇదే ప‌ద్ధ‌తి ఉంటుంద‌ని ప‌ర్వేజ్ అన్నారు. ఈ కేసులో జాద‌వ్ సివిల్ డిఫెన్స్ లాయ‌ర్‌ ను ఎంపిక చేసుకున్నాడ‌ని, మిలిట‌రీ కోర్టులో డిఫెన్స్ ఉండ‌ద‌న్న వాద‌న‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ఈ కేసులో ప్ర‌త్యేక అధికారి కావాల‌ని జాద‌వ్ చేసిన అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించార‌ని, అది కుద‌ర‌దు అని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కావాలంటే జాద‌వ్ అప్పిల్లేట్ బెంచ్‌ కు వెళ్లవచ్చు అని లేదా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఒక‌వేళ కోర్టుల‌తో కాక‌పోతే, ప్రాణ‌భిక్ష కోసం జాద‌వ్ ప్రెసిడెంట్‌ ను ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని కూడా ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌ తెలిపారు. ఫీల్డ్ జ‌న‌ర‌ల్ కోర్ట్ మార్ష‌ల్ (ఎఫ్‌ జీసీఎమ్‌) కేసులు సాధార‌ణంగా త్వ‌రిత‌గ‌తిన ముగుస్తాయ‌ని, కానీ జాద‌వ్‌ పై ఉన్న కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని, ఈ కేసు విచార‌ణ‌లో ఎటువంటి తొంద‌ర‌పాటు జ‌ర‌గ‌లేద‌ని ప‌ర్వేజ్ పేర్కొన్నారు. ఒక‌వేళ ప్రాణ భిక్ష కోరుతూ జాద‌వ్ ప్రెసిడెంట్‌ ను ఆశ్ర‌యిస్తే, అప్పుడు ఆర్మీ చీఫ్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న అంశంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ముష‌ర్ర‌ఫ్ నిరాక‌రించారు. జాద‌వ్ మ‌ర‌ణ‌శిక్ష‌పై మీడియాల్లో వార్త‌లు గుప్పుమంటున్నాయ‌ని, రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త స్వ‌ల్పంగా పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఇటీవ‌ల నేపాల్‌ లో క‌నిపించ‌కుండా పోయిన పాకిస్తాన్ ఆఫీస‌ర్ హబీబ్‌ ను భార‌త ఇంటెలిజెన్స్ ఆధీనంలోకి తీసుకునే అవ‌కాశాలున్నాయ‌ని అన్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగరాదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/