Begin typing your search above and press return to search.
గెస్ట్‌హౌస్‌లో టీకా తీసుకున్న కుల్డీప్ యాదవ్..! వైద్యశాఖ మండిపాటు..!
By: Tupaki Desk | 19 May 2021 8:30 AM GMTటీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇటీవల కోవిడ్ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. వైద్య సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఓ గెస్ట్‌హౌస్ లో కుల్దీప్ టీకా తీసుకున్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశాడు. ‘నేను ఇప్పుడే టీకా తీసుకున్నాను. మీరు కూడా టీకా తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే కుల్దీప్ టీకా తీసుకున్న ప్రదేశం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆస్పత్రిలో కాకుండా ఓ గెస్ట్‌హౌస్ లో అతడికి టీకా ఎలా ఇచ్చారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై కాన్పూర్ వైద్యశాఖ స్పందించింది.
ఈ వ్యవహారంపై కాన్పూర్ వైద్యశాఖ సీరియస్ గా స్పందించింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గెస్ట్‌హౌస్ లో ఎలా టీకా తీసుకున్నారంటూ మండిపడింది. నిజానికి కుల్దీప్.. స్థానిక గోవింద్‌నగర్ లోని జగదీశ్వర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్ నగర్ నిగం గెస్ట్‌హౌస్ లో టీకా తీసుకున్నాడు. సెలబ్రిటీ అయినా, రాజకీయనేత అయినా ఆస్పత్రిలో టీకా తీసుకోవాల్సిందే. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు సైతం ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనే టీకా తీసుకున్నారు.
కానీ కుల్దీప్ యాదవ్ ఓ గెస్ట్‌హౌస్ లో టీకా తీసుకోవడం.. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం ట్వీట్టర్ లో పోస్టు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.ఈ విషయంపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్ లో కుల్దీప్ వ్యాక్సిన్ వేసుకున్నాడనే అంశంపై విచారణ చేపట్టనున్నారు. ఐపీఎల్-2021 వాయిదా పడటంతో కుల్దీప్ యాదవ్ ఇంటికి వెళ్లాడు. ఆయనను ఇంగ్లండ్ పర్యటనకు సెలెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ టీకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.