Begin typing your search above and press return to search.
చీపురు పార్టీలో ఊహించని పరిణామం
By: Tupaki Desk | 2 May 2017 5:16 PM GMTదెబ్బ మీద దెబ్బ పడుతున్నట్లుగా ఉంది ఢిల్లీ అదికారపక్షమైన చీపురుపార్టీ అంతర్గత పరిస్థితి చూస్తే. ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన వేళ.. ఆ పనిని వదిలేసి.. మిగిలిన పనులన్నీ చూస్తూ.. ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు ఢిల్లీ ఓటర్లు. ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్గత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేజ్రీవాల్ మీదా.. ఆయన నాయకత్వం మీదా పార్టీలో అసమ్మతి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అసమ్మతి వర్గంలో ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ చేరటంతో కేజ్రీవాల్ కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే విశ్వాస్ మీద ఆప్ నేతలు పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అతన్ని బీజేపీ ఏజెంట్ గా.. ఆప్ లో చీలిక తెచ్చేందుకు బీజేపీ.. సంఘ్ పరివార్ వాడుకుంటున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించినట్లుగా తాను బీజేపీ ఏజెంట్‌ను ఎంత మాత్రం కాదని.. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదన్న ఆయన.. 24 గంటల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి విమర్శల్ని కట్టడి చేయాల్సిన కేజ్రీవాల్.. ఏమీ మాట్లాడకుండా ఉండటంపై విశ్వాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శల్ని ఖండించని కేజ్రీవాల్ ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించటంపై విశ్వాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న విశ్వాస్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా. సమస్య ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలే తప్పించి.. ఇలా పార్టీ బయట వేదికలపైకి రావటాన్ని ఆయన తప్పు పడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విశ్వాస్ పార్టీ నుంచి వైదొలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే చీపురు పార్టీకి పెద్ద దెబ్బేనన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/