Begin typing your search above and press return to search.
కుమారస్వామి పరిత్యాగం, సుపుత్రుడికి పట్టాభిషేకమూ !
By: Tupaki Desk | 3 Aug 2019 2:39 PM GMTకాలం కలసి రాకపోతే సంపన్నుడు, బలవంతుడు కూడా సాధించలేనివి చాలానే ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ కుమార స్వామి. చూడటానికి లక్కీ ఫెలో అనిపిస్తారు గాని... ఆయనది సుఖం లేని అదృష్టం. ఇంకా చెప్పాలంటే... ఆయన కుటుంబంలో అదృష్ట దురదృష్టాలు దోబూచలాడుతుంటాయి. ఒకసారి పీఎం పోస్టు, మూడు సార్లు సీఎం పోస్టు (దేవెగౌడ ఒకసారి సీఎం అయ్యారు) ఆ కుటుంబాన్ని వరించాయి. అంత పెద్ద పోస్టులు దక్కుతున్నా కంటి మీద రాజకీయ స్థిరత్వం ఉండదు. మనస్ఫూర్తిగా విజయం ఉండదు.
దేవెగౌడ ప్రధానిగా ఎక్కువ కాలం మనలేకపోయారు. కుమార స్వామి మొన్న 14 నెలలకు దిగిపోయారు. అనుకోని ముఖ్యమంత్రి పదవి చేతికి చిక్కింది కానీ... అధికారంలో ఉండి... తండ్రిని, కొడుకుని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించుకులేకపోయారు కుమారస్వామి. తుమకూరులో తండ్రి, మండ్యలో కొడుకు నిఖిల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇది సాధారణ విషయం ఏమీ కాదు. అందుకేనేమో తాజాగా కుమార స్వామికి రాజకీయ విరక్తి సన్యాసం దాకా వెళ్లింది. ఈ రాజకీయాలు వదిలేస్తేనే బాగుండును. అనుకోకుండా సీఎం అయ్యాను, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. తక్కువ కాలంలో సంతృప్తికరంగా పనిచేశాను అని చెబుతూనే... రాజకీయాల్ని వదిలేయాలన్న భావనను వ్యక్తపరిచారు కుమారస్వామి. అలా అని రాజకీయాల మీద మోజు పోయిందా అంటే అదీ లేదు.
మరోవైపు మొన్న ఓడిన కొడుకును మళ్లీ గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. కొడుకుని ఎంపీగా చెయ్యలేకపోయాననే నిరాశతో ఉన్న ఈ తాజా మాజీ ముఖ్యమంత్రి రాబోయే ఉప ఎన్నికల్లో కొడుకును ఎమ్మెల్యే అయినా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్రమైన విషయం ఏంటంటే... కొడుకు నిఖిల్ ను హీరో చేయాలనుకున్నాడు, అవలేదు. ఎంపీ చేయాలనుకున్నాడు అవలేదు. అందుకే కనీసం ఈ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేని చేసి... తాను అనుకున్నది కూడా నెరవేర్చుకోగలను అన్న పట్టుదలతో ఉన్నాడట కుమార. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు... అది ఎక్కడో చేయడం ఎందుకు? జేడీఎస్ కంచుకోట అయిన కేఆర్ పేట్ నియోజక వర్గం నుంచి నిఖిల్ చేత పోటీచేయిస్తే... ఎమ్మెల్యే చేయాలన్న కోరిక, ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కేఆర్ పేట్ ఎమ్మెల్యే నారాణగౌడ మీద పగ ఒకేసారి తీరతాయని ఈ జేడీఎస్ అధినేత భావిస్తున్నారట. అదృష్టవంతుడు అని మాత్రమే కాదు... పట్టుదల ఉన్నోడు అనిపించుకోవాలన్న అతని కోరిక తీరుస్తారో లేదో తథాస్తు దేవతలు.