Begin typing your search above and press return to search.
నేడు బలపరీక్ష: ఆస్పత్రిలో కుమారస్వామి
By: Tupaki Desk | 22 July 2019 4:52 AM GMTకర్ణాటక రాజకీయం సోమవారం చిత్రవిచిత్ర మలుపులు తిరుగుతోంది. బలపరీక్ష చేయించాలని బీజేపీ.. జరిపితే ప్రభుత్వం కూలిపోతుందని తప్పించుకోవాలని జేడీఎస్ -కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
తాజాగా సీఎం కుమారస్వామి బెంగళూరులోని ఆపోలో ఆస్పత్రిలో అనారోగ్య కారణాలతో చేరారు. హైబీపీ- ఇతర అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది. విశ్వాస పరీక్షను మరింత ఆలస్యం చేయడానికే కాంగ్రెస్-జేడీఎస్ వ్యూహాత్మకంగా ఇలా సీఎంతో నాటకాలు ఆడిస్తున్నాయని ఆరోపించారు బీజేపీ నేతలు.
కాగా సోమవారం ఖచ్చితంగా బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ సురేష్ కుమార్ కు కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మంగళవారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
కాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సీఎం కుమారస్వామి తాజాగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కివస్తే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే కూలడమా.? రాష్ట్రపతి పాలన అనేది సోమవారం తేలనుంది.