Begin typing your search above and press return to search.

తిరుగుబాటు గ్రూప్ క‌ల‌క‌లం..ఒప్పుకొన్న సీఎం

By:  Tupaki Desk   |   8 Jun 2018 4:09 PM GMT
తిరుగుబాటు గ్రూప్ క‌ల‌క‌లం..ఒప్పుకొన్న సీఎం
X

ప్ర‌భుత్వం కొలువుదీరి పాతిక రోజులు కూడా కాకుండానే...కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తిరుగుబాటు ముప్పు మొద‌లైంది. ఇది ఏకంగా ఆయ‌న సీటుకు ఎస‌రు పెట్టే స్థాయికి చేరుతుండ‌టం ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. ఈ ప‌రిణామం త‌న‌కు కూడా తెలుసున‌ని సీఎం కుమార‌స్వామి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం! అనేక ట్విస్టుల మ‌ధ్య మంత్రివ‌ర్గ బెర్తుల‌ను ఓ కొలిక్కి తెచ్చి 25 మందితో నూతన మంత్రివర్గాన్ని కుమార‌స్వామి ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. 14 మంది కాంగ్రెస్ సభ్యులకు - తొమ్మిదిమంది జేడీఎస్ సభ్యులకు - బీఎస్పీ - కేపీజీపీ నుంచి ఒక్కొక్కరికీ మంత్రివర్గంలో చోటుదక్కింది. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్దకుమారుడు రేవణ్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ - మహిళా ఎమ్మెల్యే జయమాల(కాంగ్రెస్) ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.

అయితే, రాజ్‌ భవన్‌ లో గవర్నర్ వాజుబాయివాలా నూతన మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న స‌మ‌యంలోనే...ఆ పార్టీలో కుంప‌ట్లు మొద‌ల‌య్యాయి. దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. దీంతో ప్ర‌భుత్వంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. పైగా వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు ఉండ‌టంతో...ఆ పార్టీ త‌ల ప‌ట్టుకుంది. పార్టీ పెద్ద‌ల ఆదేశాల మేర‌కు...కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర రంగంలోకి దిగి సదరు ఎమ్మెల్యేలను సముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే - పీసీసీ ర‌థ‌సార‌థి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. దీంతో..క‌న్న‌డ రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిర‌గ‌నున్నాయ‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

మ‌రోవైపు తిరుగుబాటు గ్రూపు బ‌లం పెరుగుతోంది. సీనియర్‌ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్‌ - రోషన్‌ బేగ్‌ - రామలింగా రెడ్డి - కృష్ణప్ప - దినేశ్‌ గుండురావు - ఈశ్వర్‌ ఖండ్రే - షమనూర్‌ శివశంకరప్ప - సతీష్‌ జాక్రిహోలిలు కేబినేట్‌ లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉ‍ండి ఈ అస‌మ్మ‌తి గ్రూపును న‌డిపిస్తున్నార‌ని అంటున్నారు. ఈ శిబిరంలో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండ‌టంతో..కుమార‌స్వామి స‌ర్కారు మ‌నుగ‌డ ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ‌లు మొద‌ల‌వుతున్నాయి.