Begin typing your search above and press return to search.
కుమారస్వామి – అంబరీష్ ఫొటో వైరల్ ... ఫ్యాన్స్ ఆగ్రహం !
By: Tupaki Desk | 9 July 2021 5:38 AM GMTప్రముఖ నటి, మండ్య స్వత్రంత్య ఎంపీ సుమలతపై కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని సుమలత కూడా కొంచెం స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు కుమారస్వామి ఆలోచన ధోరణికి అద్దం పడుతున్నాయని అన్నారు. కృష్ణ రాజ సాగర్(కేఆర్‌ఎస్) డ్యామ్ బీటలు వారి లీకేజీ జరుగుతోందిని, అక్రమ మైనింగ్ ఇందుకు కారణమని సుమలత వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ప్రతి విమర్శ చేసిన కుమారస్వామి.. సుమలతపై మండిపడ్డారు. కేఆర్ ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్ ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేఆర్‌ఎస్ డ్యామ్‌ను ఆమె ఒక్కరే రక్షించే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ లీకేజ్ ఉంటే.. లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెట్టాలి. మండ్యకు ఇలాంటి ఎంపీ గతంలో ఎన్నిక కాలేదు, భవిష్యత్తులో కూడా ఉండబోరు. ఆమె సానుభూతితో ఎన్నికల్లో గెలిచారు. ఆమె సరిగా పనిచేయనివ్వండి. ఆమెకు మరోసారి ఇలాంటి అవకాశం రాదు. ఆమె వ్యక్తిగత ద్వేషంతో కూడిన ప్రకటనలు చేస్తోంది. ప్రజలు ఆమెను క్షమించరు అంటూ మాజీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
కుమాస్వామి వ్యాఖ్యలపై స్పందించిన సుమలత.. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని అన్నారు. ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని వ్యాఖ్యానించారు. ఇక, కేఆర్‌ఎస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను సుమలత సమర్ధించుకున్నారు. విపత్తు నిర్వహణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఇదే రకమైన ఆందోళనలను వ్యక్తం చేసిందని చెప్పారు. కేంద్ర జల శక్తి మంత్రితో, పార్లమెంట్‌లో తాను ఈ విషయాన్ని లేవనెత్తానని చెప్పారు. అదే విధంగా కేఆర్‌ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత తెలిపారు.
ఈ నేపథ్యంలోనే అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కుమారస్వామి తాజాగా స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదని, ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సుమలత, అంబరీష్ ఫ్యాన్స్ కుమారస్వామి , అంబరీష్ పాత ఫొటోలు షేర్ చేస్తూ పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సుమలత.. జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించిన సంగతి తెలిసిందే.