Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కనిపించని కుమారస్వామి, ప్రకాష్ రాజ్!
By: Tupaki Desk | 18 Jan 2023 5:05 PM GMTకేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు మొదట ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు ఈరోజు ఖమ్మం సభలో లేకుండా పోయారు. వారే కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత కుమారస్వామి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఈ ఇద్దరూ కేసీఆర్ వెంట ఉన్నారు. కానీ ఇప్పుడు లేరు. జేడీఎస్ నుంచి ఎవరూ రాలేదు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకముందే ఇద్దరు కీలక కర్ణాటక వ్యక్తులు బీఆర్ఎస్ నుంచి దూరంగా జరిగినట్టు అర్థమవుతోంది.
కేసీఆర్ జాతీయ పార్టీ అనుకున్న తర్వాత ప్రతి సందర్భంలోనూ కుమారస్వామి వచ్చారు. బీఆర్ఎస్ తీర్మానం చేసినప్పుడు.. అధికారికంగా ఈసీ నుంచి వచ్చి సంతకం చేసినప్పుడు ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ వచ్చారు. కానీ అసలైన ఆవిర్భావ సభ విషయంలో మాత్రం దూరంగా ఉన్నారు. కానీ అసలైన ఆవిర్భావ సభ విషయంలో మాత్రం దూరంగా ఉన్నారు. కుమారస్వామికి ఇతర కార్యక్రమాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కానీ ఆయన ఏదో తేడా కొడుతోందని అంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకు జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ అధికారం పంచుకుంది. ఈసారి కూడా అదే చేయాలని చూస్తున్నారు. అయితే కేసీఆర్ తన బీఆర్ఎస్ ను కర్ణాటకలో విస్తరించడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ కూడా కర్ణాటకలో జేడీఎస్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ కూడా ప్రచారానికి వస్తానన్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేసే అంశంలో రెండు పార్టీల నేతల మధ్య పొసగలేదన్న రూమర్ ప్రచారంలో ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వర్గాలు మొగ్గు చూపడంతోనే కుమారస్వామి హర్ట్ అయినట్టు సమాచారం. అందుకే జేడీఎస్ తో కేసీఆర్ కు విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక ప్రకాష్ రాజ్ కు కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. గతంలోనూ ఆయన యాక్టివ్ గా పాల్గొన్నారు. కానీ ఆవిర్భావ సభలో ప్రకాష్ రాజ్ కనిపించలేదు. ఇలా కర్ణాటకకు చెందిన ఇద్దరు కీలక నేతలు దూరం కాగా.. ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్టులు కేసీఆర్ కు దగ్గరయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.