Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో దోస్తీ.. ఆయనతో కుస్తీ!

By:  Tupaki Desk   |   25 Sep 2019 6:32 AM GMT
కాంగ్రెస్ తో దోస్తీ.. ఆయనతో కుస్తీ!
X
కర్ణాటకలో చేజేతులారా ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి బీజేపీ ప్రయత్నాలు ఎంత వరకూ కారణమో - కాంగ్రెస్-జేడీఎస్ నేతల మధ్యన విబేధాలు కూడా అంతే కారణమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సంకీర్ణంలో తన మాట జరగడం లేదని - తన ఆటలు సాగడం లేదని సిద్ధరామయ్యే ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి బయటకు పంపించారనే టాక్ కూడా ఉంది. అంతజేసీ ఇప్పుడు సిద్ధరామయ్య బావుకునేది కూడా ఏమీ లేదు. అప్పుడు కనీసం తమ పార్టీ అధికారంలో ఉండేదనే గ్రిప్ అయినా ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చటా లేదు.

ఎలాగైతేనేం ప్రభుత్వం పడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్- జేడీఎస్ నేతల మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూ ఉంది. సిద్ధరామయ్యపై మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అవుతూ ఉన్నారు. అలాగే సిద్ధరామయ్య కూడా కుమారపై ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ నేతలిద్దరి పరస్పర విమర్శల పర్వం కొనసాగుతూ ఉంది.

మండ్యలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన తనయుడు ఓటమికి కాంగ్రెస్సే కారణమని కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలతకు సహకరించారని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య కొట్టి పడేశారు. జేడీఎస్ లోనే చీలిక వచ్చిందని, జేడీఎస్ వాళ్లే ఇండిపెండెంట్ కు సపోర్ట్ చేశారన్నట్టుగా ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత సిద్ధూ పై కుమారస్వామి మరోసారి విమర్శలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవమే అని, ఆ పార్టీ వాళ్లే తనను సీఎంను చేశారని.. అయితే సిద్ధరామయ్య దయవల్ల తను సీఎం కాలేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. తను కుమారస్వామి పెంపుడు చిలకను కాదంటూ.. విమర్శలు చేశారు. కాంగ్రెస్ తో దోస్తీనే అంటూ ఇలా సిద్ధరామయ్యతో కుస్తీ పడుతున్నారు కుమారస్వామి.