Begin typing your search above and press return to search.

14 నెలల ప్రభుత్వం.. 24 రోజుల్లో పతనం!

By:  Tupaki Desk   |   24 July 2019 4:33 AM GMT
14 నెలల ప్రభుత్వం.. 24 రోజుల్లో పతనం!
X
కాంగ్రెస్‌ - జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 14 నెలల తర్వాత తెర పడింది. ఈమేరకు జూలై 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రోజురోజుకీ అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కసారిగా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కోసం అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు మంత్రులందరు పదవీత్యాగం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

– జూలై 1వ తేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనందసింగ్ - రమేశ్‌ జార్కిహోళి
– 6వ తేదీ 11 మంది - 8వ తేదీ స్వతంత్య్ర ఎమ్మెల్యేలు హెచ్‌.నగేశ్ - ఆర్‌.శంకర్‌ మంత్రి పదవులకు రాజీనామా
– 9వ తేదీ రోషన్‌ బేగ్‌ రాజీనామా - 10వ తేదీ ముంబయిలో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించారు.
– 11వ తేదీ ముంబయిలో మంత్రి డీకే శివకుమార్‌ చర్చలు విఫలం
– 12వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. బల నిరూపణకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటన. మూడు పార్టీల ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు.
– 15వ తేదీ అవిశ్వాస తీర్మానానికి బీజేపీ పట్టు. 18న బల పరీక్షకు స్పీకర్‌ తీర్మానం
– 17వ తేదీ అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ తుది నిర్ణయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
– 18వ తేదీ నిర్వహించాల్సిన బల పరీక్ష 22వ తేదీకి వాయిదా
– 22వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల వరకు సభ జరిగింది. మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటలకు విశ్వాస పరీక్ష వాయిదా.
– 23వ తేదీ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం. సాయంత్రం 4 గంటలకు సీఎం హాజరయ్యారు. కుమారస్వామి సుదీర్ఘ ప్రసంగం తర్వాత రాత్రి 7.21 గంటలకు బల పరీక్ష ప్రారంభమైంది. కుమారస్వామికి 99 మంది మద్దతు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. మరో 20 మంది గైర్హాజరయ్యారు.

గైర్హాజరు అయిన వారిలో..ఒకరు బీఎస్పీ - ఇద్దరు ఇండిపెండెంట్లు - 14 మంది కాంగ్రెస్ - ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు.