Begin typing your search above and press return to search.
బ్రేకింగ్..కన్నడనాట కూలిన కుమార సర్కారు
By: Tupaki Desk | 23 July 2019 2:26 PM GMTట్విస్టుల మీద ట్విస్టులు తిరిగిన కర్ణాటక రాజకీయం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. బల పరీక్షలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ కూటమి ఓడిపోయింది. స్వయంగా సీఎం కుమార స్వామి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన ఓటమి పాలయ్యారు. గత వారం నుంచి కొనసాగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభానికి దాదాపుగా తెర పడిపోయింది. సంకీర్ణ కూటమిలో 15 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో... కుమార సర్కారుకు తగినంత బలం లేదని బీజేపీ ఆరోపణ చేసింది. ఈ క్రమంలో శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ వాజూభాయ్ వాలా... సీఎం కుమార స్వామికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో కేవలం కుమార బలపరీక్ష నిరూపణ కోసమే సమావేశమైన శాసనసభా సమావేశాలను కుమార సర్కారు తనదైన శైలిలో నాలుగు రోజుల పాటు నడిపింది. ఈ నాలుగు రోజుల్లో అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. సంకీర్ణ కూటమికి చెందిన స్పీకర్ రమేశ్ కుమార్.. బల పరీక్ష ఎప్పటికప్పుడు వాయిదా పడేలా వ్యవహరించారన్న ఆరోపణలూ వినిపించాయి. అయితే నాలుగో రోజైన మంగళవారం సాయంత్రం సభలో బల పరీక్షకు స్పీకర్ అనుమతి ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో తన సర్కారును కుప్ప కూల్చేందుకు బీజేపీ శిబిరం చేసిన, చేస్తున్న యత్నాలను ఏకరువు పెడుతూ సీఎం హోదాలో కుమార స్వామి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత తన సర్కారుపై విశ్వాస పరీక్షను కుమారనే స్వయంగా ప్రతిపాదించారు.
ఈ క్రమంలో సభలో జరిగిన బల పరీక్షలో మేజిక్ ఫిగర్ 103 కాగా... సంకీర్ణ కూటమికి 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఏకంగా 105 ఓట్లు పడ్డాయి. దీంతో కుమార సర్కారు బల పరీక్షలో ఓడిపోయిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటన చేశారు. నేటి సమావేశాలకు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో రాజీనామాలు చేసిన 15 మంది సంకీర్ణ కూటమికి చెందిన సభ్యులు కాగా ఓ ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ కు చెందిన వారే. వీరిద్దరూ అనారోగ్య కారణాలతో సభకు హాజరు కాలేకపోయారు. కర్ణాటక శాసనసభలో సభ్యుల మొత్తం సంఖ్య 225 కాగా నామినేటెడ్ సభ్యుడిని మినహాయిస్తే మొత్తం సభ్యుల సంఖ్య 224 కాగా... గైర్హాజరైన 18 మందిని తీసేస్తే... సభకు హాజరైన వారి సంఖ్య 206గా తేలింది. వీరిలో స్పీకర్ రమేశ్ కుమార్ - నామినేెటెడ్ మెంబర్ ను మినహాయిస్తే బల పరీక్షలో పాలుపంచుకున్న వారి సంఖ్య 204గా తేలింది. దీంతో మేజిక్ ఫిగర్ 103 గా నిలిచింది. బల పరీక్షలో సంకీర్ణ సర్కారుకు 99 ఓట్లు రాగా... వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. ఫలితంగా కుమార సర్కారు కుప్ప కూలింది.